సాధారణంగా మనకు అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్ని సూక్ష్మ క్రిముల కారణంగా వస్తే.. కొన్ని మన నిర్లక్ష్యం వల్లే వస్తుంటాయి. అయితే కొన్ని రకాల వ్యాధులు మాత్రం మన జీవనశైలి అస్తవ్యస్తంగా మారడం వల్లే వస్తాయి. ముఖ్యంగా మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా.. మనం పాటించే ఆహారపు అలవాట్ల వల్లే ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. కానీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం కొద్దిపాటి మార్పులు చేసుకోవడం వల్ల 100కు పైగా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చట. మరి వారు చెబుతున్న సూచనలు ఏమిటంటే..
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఎప్పుడు భోజనం చేసినా సరే.. భోజనానికి 1 గంట ముందు నీళ్లు తాగాలి. తరువాత భోజనం చేశాక గంట విరామం ఇచ్చాక మాత్రమే నీళ్లను తాగాలి. అంతేకానీ భోజనం చేసే సమయంలో నీళ్లను తాగరాదు. అలా చేయడం వల్ల మనం తాగే ద్రవాలు పొట్టలోని యాసిడ్ తో ప్రభావం చెందుతాయి. దీంతో ఆహారం జీర్ణమయ్యేందుకు కావల్సిన యాసిడ్ మొత్తం నీటితో నిండిపోతుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. కనుక భోజనానికి గంట ముందు లేదా భోజనం చేశాక గంట తరువాత మాత్రమే నీళ్లను తాగాలి. భోజనం చేసే సమయంలో నీళ్లను తాగరాదు. తాగితే అసిడిటీ, గ్యాస్, మలబద్దకం వస్తాయి. అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
ఇక చాలా మంది చల్లని నీళ్లను అధికంగా తాగుతారు. అలా చేయడం వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కొవ్వులా మారుతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక చల్లని నీళ్లను తాగరాదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న సాధారణ నీళ్లను తాగాలి. లేదా గోరు వెచ్చని నీళ్లను తాగాలి. కేవలం గోరు వెచ్చని నీళ్లనే రోజూ తాగడం వల్ల నెలకు సుమారుగా 1 నుంచి 2 కిలోల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గోరు వెచ్చని నీళ్లను తాగడం ఉత్తమం. దీంతో గ్యాస్, అజీర్ణం, మలబద్దకం ఉండవు.
ఇక చాలా మంది టీవీ చూస్తూ భోజనం చేస్తారు. అలా ఎట్టి పరిస్థితిలోనూ చేయరాదు. టీవీ చూస్తూ భోజనం చేస్తే అధికంగా తింటారు. ఏం తింటున్నారు.. ఎంత తింటున్నారు.. అనే విషయం తెలియదు. దీంతో అధికంగా తినేస్తారు. ఫలితంగా క్యాలరీలు అధికంగా వస్తాయి. బరువు పెరుగుతారు. కాబట్టి ఈ అలవాటును కూడా మానేయాలి.
ఇక రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడంతోపాటు 6 నుంచి 8 గంటల పాటు నిద్రించాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఇలా పలు సూచనలు పాటించడం వల్ల 100కు పైగా వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ సూచనలను పాటిస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు.