Belly Fat : నెల రోజుల పాటు ఇలా చేస్తే.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగి బ‌రువు మొత్తం త‌గ్గుతారు..!

Belly Fat : అధిక బరువుతోపాటు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అనే స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఈ రెండింటి కార‌ణంగా అనేక మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వీటిని త‌గ్గించుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోలేక‌పోతున్నామ‌ని.. విచారం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

follow these tips for one month to reduce belly fat and over weight
Belly Fat

1. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఒక లీట‌ర్ గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. ఇది శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతోపాటు శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా క‌ర‌గ‌డం ఉద‌యం నుంచే ప్రారంభ‌మ‌వుతుంది. ఫ‌లితంగా కొవ్వు వేగంగా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ చేస్తే నెల రోజుల్లోనే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

2. ఉద‌యం, సాయంత్రం పండ్ల‌ను బాగా తినాలి. ఉద‌యం తినే ఇడ్లీ, దోశ వంటి బ్రేక్‌ఫాస్ట్‌ల‌కు బ‌దులుగా మీకు న‌చ్చిన పండ్ల‌ను ఎంతైనా స‌రే తినండి. అలాగే సాయంత్రం భోజనం చేయ‌కుండా.. 7 గంట‌ల లోపు మీకు న‌చ్చిన పండ్ల‌ను మ‌ళ్లీ ఎంతైనా స‌రే తినండి. ఇక మ‌ధ్యాహ్నం భోజనంలోనూ అన్నం కాకుండా బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాల‌ను తీసుకోవాలి. ఇలా ఒక వారం పాటు తింటే చాలు.. మీ శ‌రీరంలో అనూహ్య‌మైన మార్పులు వ‌స్తాయి. త‌ప్ప‌క బ‌రువు త‌గ్గుతారు. పండ్ల‌లో, చిరు ధాన్యాల్లో, బ్రౌన్ రైస్‌లో.. ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది అధిక బ‌రువును, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును వేగంగా కరిగిస్తుంది. క‌నుక వీలైనంత ఎక్కువ‌గా ఆయా ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి.

3. మాంసాహారం పూర్తిగా మానేయాలి. క‌నీసం పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, అధిక బ‌రువు త‌గ్గే వ‌ర‌కు అయినా స‌రే మాంసాహారాన్ని పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. వాటికి బ‌దులుగా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో మొల‌కెత్తిన పెస‌ల‌ను తినాలి. ఇవి మన శ‌రీరానికి కావ‌ల్సిన రోజువారీ ప్రోటీన్ల‌ను అందిస్తాయి. క‌నుక మాంసాహారం తిన‌కున్నా చింతించాల్సిన ప‌నిలేదు. పైగా పెస‌లు బ‌రువు త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.

4. ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో రెండు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను అలాగే న‌మిలి మింగాలి. ఇవి ఘాటుగా ఉంటాయి క‌నుక నేరుగా తిన‌లేమ‌ని అనుకుంటే ఒక టీస్పూన్ తేనెతో తీసుకోవ‌చ్చు. వెల్లుల్లిని ఇలా తీసుకుంటే శ‌రీరంలోని చెడు కొవ్వు (ఎల్‌డీఎల్‌) అంతా క‌రిగిపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే బ‌రువు కూడా త‌గ్గుతారు.

5. రోజులో ఆక‌లి బాగా ఉన్న స‌మ‌యంలో ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగాలి. ఇది ఆక‌లిని నియంత్రిస్తుంది. బ‌రువు త‌గ్గేలా.. కొవ్వు క‌రిగేలా చేస్తుంది. క‌నుక ఈ చిట్కాల‌ను పాటిస్తే.. కొవ్వును, అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. క‌నీసం నెల రోజుల పాటు ఈ విధంగా చేస్తే ఆశించిన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts