హెల్త్ టిప్స్

Weight Gain : బ‌క్క‌గా, స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

Weight Gain : మ‌నలో చాలా మంది బ‌రువు పెర‌గ‌డానికి కూడా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఉండాల్సిన బ‌రువు కంటే కూడా త‌క్కువ బ‌రువు ఉంటారు. అయితే కొంద‌రిలో బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు కూడా ఉంటాయి. ర‌క్త‌హీన‌త‌, నీర‌సం, బ‌ల‌హీన‌త, ఏప‌ని మీద శ్ర‌ద్ద పెట్ట‌లేక‌పోవ‌డం, పోష‌కాహార లోపం వంటి వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక మ‌నం మ‌న వ‌య‌సుకు త‌గినంత బ‌రువు ఉండ‌డం చాలా అవ‌స‌రం. చాలా మంది బ‌రువు పెర‌గడానికి మార్కెట్ లో ల‌భించే వివిధ ర‌కాల మందుల‌ను, సిరప్ ల‌ను, పౌడ‌ర్ల‌ను వాడుతూ ఉంటారు. కానీ వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం లేక మ‌ర‌లా నిరుత్సాహ ప‌డుతూ ఉంటారు. అలాగే మ‌రికొంద‌రు బ‌రువు పెర‌గాల‌ని జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు.

జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక మ‌నం వీలైనంత వ‌ర‌కు ఆరోగ్యంగా బ‌రువు పెర‌గాలి. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు ప్రోటీన్ లు మ‌రియు మంచి కొవ్వులు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాల‌న్నా ముందుగా మ‌న‌కు ఆక‌లి ఎక్కువ‌గా ఉండాలి. క‌నుక రోజూ ఉద‌య‌మే లీట‌ర్ నుండి లీట‌ర్నర నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పొట్ట పూర్తిగా శుభ్ర‌మ‌వుతుంది. దీంతో ఆక‌లి పెరుగుతుంది. బ‌రువు పెంచేలా చేయ‌డంలో మ‌న‌కు ప‌ల్లీలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ప్రోటీన్లు, ఫ్యాట్ లు ఎక్కువ‌గా ఉంటాయి. ప‌ల్లీల‌ల్లో 50 శాతం ఫ్యాట్, 25 శాతం ప్రోటీన్ ఉంటుంది. అలాగే ప‌చ్చి కొబ్బ‌రిలో కూడా ఫ్యాట్, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక రోజూ ఉద‌యం నాన‌బెట్టిన ప‌ల్లీల‌ను, కొబ్బ‌రిని క‌లిపి తీసుకోవాలి.

follow these tips for weight gain

వీటితో పాటు మ‌న‌కు న‌చ్చిన వివిధ ర‌కాల పండ్ల‌ను తీసుకోవాలి. అలాగే మ‌ధ్యాహ్నం పూట కొర్ర‌లు, సామ‌లు, జొన్న‌లు, బియ్యంతో వండిన 70 శాతం తీసుకోవాలి. కూర‌ల‌ను 30 శాతం తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావల్సిన‌న్ని కార్బోహైడ్రేట్స్ ల‌భిస్తాయి. నీర‌సం త‌గ్గుతుంది. అదే విధంగా సాయంత్రం పూట పుచ్చ‌గింజ‌ల ప‌ప్పు, పొద్దు తిరుగుడు ప‌ప్పు, గుమ్మ‌డి గింజ‌లు, డ్రై న‌ట్స్ ను నాన‌బెట్టి తీసుకోవాలి. అలాగే 2 నుండి 3 అర‌టి పండ్ల‌ను తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. క‌నీసం నెల‌కు రెండు కిలోల వ‌ర‌కు బ‌రువు సుల‌భంగా పెర‌గ‌వ‌చ్చు. ఈ విధంగా చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌గా కండ‌ప‌డ‌తారు. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. వేగంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చు. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Admin

Recent Posts