డయాబెటీస్ వ్యాధి అశ్రధ్ధ చేస్తే, శరీరంలోని భాగాలను చాపకింద నీరులా ఆక్రమించి పాడు చేయగలదు. జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసి జీవిస్తే.. సందర్భానుసారంగా మీరు స్వీట్ కూడా తినేయవచ్చు. దీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చు. అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి. ప్రతిరోజూ షుగర్ స్ధాయిలను ఆహారం, వ్యాయామాలతో నియంత్రిస్తూ వుంటే. డయాబెటీస్ నియంత్రణలో వుండటమే కాక కొంతకాలానికి వ్యాధి మీకు వున్నదన్న వాస్తవం కూడా మరుగున పడే అవకాశం వుంది. అశ్రద్ధ చేయకండి – షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేయవద్దు. ఎప్పటికపుడు పరీక్షలు చేయించటం, డాక్టర్ సలహాలు పాటించడం చేయండి.
సాధారణ ఆరోగ్యవంతునివలే వుండండి. మైండ్ లో వ్యాధి గురించి ఆలోచించకండి – షుగర్ వ్యాధి కలవారు ఎందరో వున్నారు. అందరూ సాధారణ జీవనం చేస్తూనే వున్నారు. మీరు కూడా ప్రశాంతంగా వుండండి. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే, డయాబెటీస్ ఏ మాత్రం అడ్డంకి కాదని తెలుసుకోండి.తినటం మానకండి – తినండి. షుగర్ వ్యాధి డైట్ ప్రణాళికను ఆచరించండి. పీచు అధికంగా వుండే ఆహారం, షుగర్, కార్బో హైడ్రేట్లు తక్కువగల ఆహారాలు వైద్యుల సలహా మేరకు తినండి. అప్పుడప్పుడూ ఇష్టమైన ఆహారాలు – ప్రతిరోజూ షుగర్ వ్యాధి ప్రణాళిక మేరకు ఆహారం తీసుకుంటూ, ఎపుడైనా మీకు ఇష్టమైన రుచులు తినాలంటే.., వ్యాధి నియంత్రణలో వుంటే, నిరభ్యంతరంగా తినేయండి.
ఇక ఆరోజుకు డైట్ ఛార్ట్ ఆహారాలు తినవద్దు. చిరునవ్వుతో అందరికి ధైర్యం చెప్పండి – డయాబెటీస్ వ్యాధి కలిగి మీరు విజయవంతంగా ఆరోగ్య జీవనం కలిగి వుంటే, ఇతరులకు ఈ రహస్యం చెప్పి వారి చేత కూడా మీ వలెనే ఆచరింప చేయండి. డయాబెటీస్ అనేది జీవన విధానం మారిస్తే తగ్గిపోయే వ్యాధి అని గుర్తించండి.