కిడ్నీల పనితీరును బట్టి మన శరీరం పనిచేస్తుంది. కిడ్నీలు గోదుమ గింజ ఆకృతిలో వెన్నుముకకు కింద ఇరువైపులా ఉంటాయి. అవి మానవ శరీరంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపింపిస్తాయి. అలాగే ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతాయి. బ్లడ్ ప్రెషర్‌ను అందుబాటులో ఉంచుతాయి. కిడ్నీలు ఎప్పుడైతే ఈ పనిని చేయకుండా నిలిచిపోతాయో అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. నిద్రలేమి, యూరినేషన్ సమస్యలు, నాసీయా, వెయిట్ లాస్, బాడీ వీక్‌నెస్, అలసట, కండరాల సమస్యలు కనిపిస్తాయి. అనేమియా కూడా సంభవిస్తుంది. పాదాలు, చీలమండలంలో వాపు ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ ప్రధాన కారణాలు.
కిడ్నీ ఫెయిల్యూర్ ప్రధాన లక్షణం హై బ్లడ్ ప్రెషర్, డయాబిటీస్. రక్త సరఫరా సరిగా కాకపోవడం ఇవన్ని కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినపుడు, శరీరానికి దెబ్బలు తగిలినపుడు కిడ్నీలు పాడవుతాయి. ఒకవేళ యూరినల్ సమస్యలు ఉన్న కూడా ఇది డైరెక్టగా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. డాక్టర్ల ద్వారా కిడ్నీలపై ప్రభావం చూపే హైబీపీ, డయాబెటీస్‌ను కంట్రోల్ చేయవచ్చు. కొలెస్ట్రల్ లెవల్‌ను తగ్గించుకోవచ్చు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కిడ్నీ మార్పిడి చేయాలని, డయాలసిస్‌ని డాక్టర్లు సూచిస్తారు.
యోగా.. ఇది కిడ్నీ వ్యాధులను దూరం చేసే సరైన పద్ధతి. యోగా వల్ల శరీరానికి మంచిది. యోగా ఆసనాలు వేయటం ద్వారా బాడీ క్లెన్సింగ్ అయి కిడ్నీల పనితీరును సరైన పద్ధతిలో చే స్తుంది. అలాగే కిడ్నీ సంబంధిత రోగులు కూడా యోగా ఆసనాలు చేయడం ద్వారా వారి కిడ్నీల పనితీరు మెరుగ్గా అవుతుంది. బయట ఆహారాన్ని తినడం తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారాన్ని తినాలి. పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ప్రత్యేకంగా ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి.– ఎక్కువ మోతాదులో నీటిని తాగాలి. ప్రతిరోజు 6–8 గంటలపాటు నిద్రపోవాలి.