Foods For Hair : ఈ సూప‌ర్ ఫుడ్స్‌ను తిన్నారంటే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!

Foods For Hair : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌నిపిస్తాము. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే పెద్ద స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌సులోనే జుట్టు రాలిపోవ‌డం వ‌ల్ల మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న‌, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి కార‌ణాల చేత జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. అయితే జుట్టు రాల‌డానికి మ‌రొక కార‌ణం కూడా ఉంది అదే పోష‌కాహార లోపం. నేటి త‌రుణంలో జంక్ ఫుడ్ ను, బ‌య‌ట ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటున్నారు. దీంతో మ‌న శ‌రీరానికి అలాగే జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాలు అందడం లేదు.

జుట్టు పెరుగుద‌ల‌కు కావ‌ల్సిన‌ పోష‌కాలు అంద‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ ఆహారాల‌ను మ‌నం తీసుకునే ఆహారంలో చేర్చుకోవ‌డం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా పెంచే ఈ ఆహారాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో కొబ్బ‌రి మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. దీనిలో ఉండే పోష‌కాలు జుట్టు పెరుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది. జుట్టు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో నువ్వులు కూడా ఒక‌టి. నువ్వులల్లో పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.

Foods For Hair take them regularly for better effect
Foods For Hair

ఇవి జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంతో పాటు జుట్టు తెల్ల‌బ‌డ‌డాన్ని కూడా నిరోధిస్తాయి. ప‌వ‌ర్ హౌస్ గా పిలిచే చియా విత్త‌నాలు కూడా జుట్టు పెరుగుద‌ల‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిలో జుట్టు పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ఇవి జుట్టు ప‌లుచ‌బ‌డ‌డాన్ని త‌గ్గించి జుట్టును ఒత్తుగా, పొడువుగా పెరిగేలా ప్రేరేపిస్తాయి. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో బాదంప‌ప్పు కూడా మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో మెంతికూర‌, మెంతి గింజ‌లు కూడా ఒక‌టి. ఇవి జుట్టు రాల‌డాన్ని, జుట్టు దెబ్బ‌తిన‌డాన్ని త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి.

మెంతుల‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టుకు సంబంధించిన ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. అలాగే పిస్తా, జ‌న‌ప‌నా గింజ‌లు, అవిసె గింజ‌లు, వాల్ న‌ట్స్, గుమ్మ‌డి గింజ‌లు, పొద్దు తిరుగుడు గింజ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వీటిలో జుట్టు పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించి జుట్టు పెరిగేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ప్ర‌తిరోజూ ఈ ఆహారాల‌ను రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని మ‌నం సుల‌భంగా అరిక‌ట్ట‌వ‌చ్చు.

Share
D

Recent Posts