మన శరీరంలో ఉండే రక్తం ఎన్ని విధులను నిర్వహిస్తుందో అందరికీ తెలిసిందే. కణాలకు ఆహారాన్ని తీసుకుపోవడం, ఆక్సిజన్‌ను రవాణా చేయడం, పోషకాలను అవయవాలకు పంపడం… తదితర ఎన్నో కార్యక్రమాలను రక్తం నిర్వహిస్తుంది. మనకు ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్లు రక్త పరీక్ష చేసి అందులో వచ్చే ఫలితానికి అనుగుణంగా మనకు చికిత్స చేస్తారు. అయితే రక్తంలోనూ వివిధ రకాల గ్రూపులు ఉన్నాయి. కొందరి బ్లడ్ గ్రూపులు అరుదుగా దొరికితే కొందరివి సాధారణ బ్లడ్ గ్రూప్‌లు అయి ఉంటాయి. కానీ మీకు తెలుసా..? ఏ బ్లడ్ గ్రూప్‌కు చెందిన వారు ఎలాంటి ఆహారం తినాలో..?
ఓ గ్రూప్ వారు – ఈ గ్రూప్ రక్తం ఉన్న వారికి సహజంగా జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉంటాయి. వీరు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఎ గ్రూప్ – వీరికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరు నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తినాలి. వెల్లుల్లి, ఆకుపచ్చని కూరగాయలను బాగా తినాలి. బి గ్రూప్ – వీరికి ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంటుంది. అందుకు కారణం వారి శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్లే. వీరు కొవ్వులను, నూనె పదార్థాలను, ఆల్కహాల్‌ను మానేయాలి.
ఏబీ గ్రూప్ – వీరి జీర్ణాశయంలో ఆమ్ల రసాలు తక్కువగా ఉంటాయి. అందుకని వీరు యాపిల్ సైడర్ వెనిగర్, మనూకా తేనెలను ఎక్కువగా తినాలి. అయితే ఆహారమే కాదు, బ్లడ్ గ్రూప్‌లను బట్టి ఆయా వ్యక్తుల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో కూడా చెప్పవచ్చు… ఓ గ్రూప్ – వీరు ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కంగారు పడుతుంటారు. ఎ గ్రూప్ – వీరు అమితమైన జాలి గుణం కలిగి ఉంటారు. తమ అవసరాల కన్నా పక్క వారి అవసరాలను వీరు గుర్తించి వాటిని తీర్చే పనిలో పడతారు. బి గ్రూప్ – వీరు భావోద్వేగాలకు గురవుతుంటారు. స్నేహపూర్వకంగా ఉంటారు.
ఏబీ గ్రూప్ – ఈ గ్రూప్ రక్తం ఉన్న వారు దేనికీ భయపడరు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. పైన చెప్పిన విషయాలే కాదు బ్లడ్ గ్రూప్‌ల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే… ఓ గ్రూప్ రక్తం ఉన్న వారికి సంతానం కలిగేందుకు అవకాశం బాగా తక్కువగా ఉంటుందట. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవడం వల్ల ఎ గ్రూప్ బ్లడ్ ఉన్న వారు బాగా ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతారట. ఓ గ్రూప్ బ్లడ్ ఉన్న వారు ఇతరులను త్వరగా ఆకట్టుకుంటారట. ఎ గ్రూప్ బ్లడ్ ఉన్న వారు పాలు, మాంసం వంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలట. లేదంటే వాటితో కొవ్వు పెరుగుతుందట. వీరు పొట్ట కరిగించడం చాలా కష్టతరమవుతుందట. వీరికి గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట.