వినోదం

ఒక‌ప్ప‌టి సూప‌ర్ సినిమా హీరోయిన్ అయేషా ట‌కియా… ఇప్పుడెలా ఉందో తెలుసా..?

మిల మిల మెరిసిన క‌నుల‌కు ఎందుకో… అసలెందుకో… అంటూ ఒక‌ప్పుడు తెలుగు తెర‌పై బబ్లీగా, ముద్దుగా క‌నిపించిన ఆ భామ… అదేనండీ అయేషా ట‌కియా… గుర్తుంది క‌దా..! మహేష్ బాబు స‌ర‌స‌న పోకిరి సినిమాలో ముందుగా ఈమెనే హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌. అయితే ఆమెకు ఏం అయిందో తెలీదు కానీ… ఆ సినిమా వ‌దులుకుంది. మ‌రి అందులో న‌టించిన న‌డుం సుంద‌రి ఇలియానా గ్రాఫ్ ఒక్క‌సారిగా ఎలా తిరిగిపోయిందో అంద‌రికీ తెలుసు..! స‌రే.. అదంతా ఇప్పుడు ఎందుకు గానీ… అదేనండీ… ఆ అయేషా టకియా ఇప్పుడెలా ఉందో తెలుసా..?

ఎలా ఉంటుంది..! ఒక‌ప్ప‌టిలా ఇప్పుడు సినిమాలెటూ లేవు క‌దా… దీంతో… అయితే, గియితే ఇంకొంచెం బొద్దుగా త‌యారై ఉంటుంది, అంతే క‌దా..! అనుకుంటున్నారా..? అయితే అలా కాదు, ఎందుకంటే ఆమె మ‌నం ఎవ‌ర‌మూ గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. కావాలంటే ఆమె తాజా ఫొటోల‌ను మీరూ చూడ‌వ‌చ్చు..! గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన ముఖంతో మ‌న‌కు ఆమె ద‌ర్శ‌న‌మిస్తోంది. దీంతో ఆ ఫోటోల‌ను చూసిన వారు కాస్తా ఈమె ఒక‌ప్ప‌టి అయేషా ట‌కియానేనా..? అని సందేహిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

ayesha takia plastic surgery photos viral

ఫొటోలు చూశారుగా..! అయేషా ట‌కియా ఎంత‌గా మారిపోయిందో. అయితే ఆమె ఇలా మారిపోవడానికి కార‌ణం ఏమిటో తెలుసా..? ప‌్లాస్టిక్ స‌ర్జ‌రీ..! అవును, అదే. తాజాగా ఆమె పెదాల‌తోపాటు ముఖానికి కూడా ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకుంద‌ట‌. అందుకే అంత‌గా మారిపోయింది. స‌రే..! అలా త‌యారైంది ఓకే… కానీ ఆ రూపం ప‌ట్ల ఇప్పుడు జ‌నాలు మాత్రం పెద‌వి విరుస్తున్నారు. సాధార‌ణ ప్ర‌జ‌లే కాదు, ఆమె తోటి సెల‌బ్రిటీలు అయిన ప్రియాంకా చోప్రా, క‌రీనా వంటి వారు కామెంట్ చేస్తున్నారు. స‌ర్జ‌రీ బాగా లేదంటూ, ముఖం అంద విహీనంగా త‌యారైందంటూ హాస్యంగానే చ‌లోక్తులు విసురుతున్నారు. ఒక‌ప్ప‌టి బబ్లీ ఫేస్‌, బొద్దు రూప‌మే బాగుంద‌ని, ఇప్పుడేమీ బాగాలేద‌ని అంటున్నారు. మ‌రి… ఇంత‌కీ… ఈ విషయంపై మీరేమంటారు..?

Admin

Recent Posts