Garlic For Weight Loss : వెల్లుల్లితో బ‌రువు త‌గ్గ‌డం ఎలా.. ఈ 8 మెథ‌డ్స్‌ను ఫాలో అవ్వండి..!

Garlic For Weight Loss : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌పడుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన ప‌దార్థాలను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది వ‌య‌సుతో సంబంధం లేకుండా అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు మ‌న శ‌రీరానికి ఏ మాత్రం మంచిది కాదు. అధిక బ‌రువు వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక అధిక బ‌రువు నుండి మ‌నం వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌డం మంచిది. ఇలా అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు రోజూ వ్యాయామం చేయాలి. ఆహార నియ‌మాల‌ను పాటించాలి. వీటిలో పాటు మ‌న వంట‌ల్లో వెల్లుల్లిని చేర్చుకోవాలి. అవును వంట‌ల్లో వెల్లుల్లిని చేర్చుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బరువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌నం ఎంతో కాలంగా వంట‌ల్లో వెల్లుల్లిని వాడుతున్నాము. వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంతో పాటు సుల‌భంగా బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు అలాగే శ‌రీర బ‌రువు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉండాల‌నుకునే వారు వెల్లుల్లిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నేరుగా నోట్లో వేసుకుని న‌మ‌ల‌వ‌చ్చు. గోరువెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి ఆ నీటిని తాగుతూ వెల్లుల్లి రెబ్బ‌ల‌ను న‌మ‌ల‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి. మ‌నం సుల‌భంగా బరువు త‌గ్గ‌వ‌చ్చు. మ‌నం తీసుకునే ఆహారంలో భాగంగా వెల్లుల్లి చ‌ట్నీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Garlic For Weight Loss take in these 8 methods for effective result
Garlic For Weight Loss

వెల్లుల్లి, మిర‌ప‌కాయ‌లు క‌లిపి ఎక్కువ క్యాల‌రీలు చేర‌కుండా చ‌ట్నీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే కాల్చిన కూర‌గాయ‌ల‌ను బేకింగ్ చేయడానికి ముందు వాటిపై వెల్లుల్లి తురుమును వేసి బేక్ చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల రుచి పెర‌గ‌డంతో పాటుగా మ‌నం బరువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. అలాగే మ‌నం త‌యారు చేసి తీసుకునే స్మూతీల‌లో కూడా వెల్లుల్లిని వేసుకోవ‌చ్చు. స్మూతీల‌లో ఒక‌టి లేదా రెండు వెల్లుల్లి రెమ్మ‌ల‌ను వేసి త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాల‌నుకునే వారు ఇలా స్మూతీలలో వెల్లుల్లి వేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా మం వెల్లుల్లితో వెల్లుల్లి లెమ‌న్ టీని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ టీని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు వేగంగా క‌రుగుతుంది.

అలాగే కొంద‌రు స్నాక్స్, బ్రెడ్, టోస్ట్ వంటి వాటిని అవ‌కాడోతో త‌యారు చేసిన డిప్ లో తింటూ ఉంటారు. దీనిని గ్వాకామోల్ అని అంటూ ఉంటారు. దీనిలో వెల్లుల్లి చేర్చుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. అలాగే ఉద‌యం పూట కొంద‌రు కోడిగుడ్ల‌తో బ్రేక్ ఫాస్ట్ ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. దీనిలో కూడా వెల్లుల్లి వేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా ఆహారంలో వెల్లుల్లి తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. క్యాల‌రీలు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి. శ‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇలా వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌డంతో పాటు పూర్తి శ‌రీరానికి మేలు క‌లుగుతుంది.

Share
D

Recent Posts