Garlic With Warm Water : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, జుట్టు రాలడం, కంటి చూపు మందగించడం, బీపీ ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే చక్కటి జీవన విధానాన్ని పాటించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఇలా చక్కటి జీవనాన్ని అవలంభిస్తూనే ప్రతిరోజూ మనం ఒక చిన్న పదార్థాన్ని తీసుకోవడం వల్ల మన అనారోగ్య సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఈ పదార్థం మన వంటింట్లో ఉండేదే. దీనిని సరైన పద్దతిలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చు.
మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఆ పదార్థం ఏమిటి.. దీనిని ఏ విధంగా తీసుకోవాలి.. దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆ పదార్థం మరేమిటో కాదు అది వెల్లుల్లి. ఇది ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండేదే. దీనిని వంట్లలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల వంటల రుచితో పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలా మంది ఈ వెల్లుల్లిని తప్పుగా తీసుకుంటున్నారు. దీనిని ఎక్కువగా నూనెలో వేయించి తీసుకుంటూ ఉంటారు. ఇలా వేయించి తీసుకోవడం వల్ల వెల్లుల్లిని తీసుకున్నప్పటికి ఎటువంటి ఫలితం ఉండదు. వెల్లుల్లి మనకు మేలు చేయాలంటే దీనిని పచ్చిగా తీసుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మనం ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే దీనిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అదే విధంగా మన శరీరంలో నొప్పులను, వాపులను తగ్గించడంలో కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. వెల్లుల్లిని మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు. ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ గా చేసి దానిలో తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు. ఇలా వెల్లుల్లిని నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు.
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల వాత సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లిని తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణసమస్యలు తగ్గుతాయి. గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు క్రమం తప్పకుండా రెండు నెలల పాటు వెల్లుల్లిని తీసుకోవడం వల్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి. చర్మ సమస్యలను, దగ్గును తగ్గించడంలో కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. అయితే ఎండాకాలంలో ఒక వెల్లుల్లి రెబ్బను మాత్రమే తీసుకోవాలి. అదే వానాకాలంలో, చలికాలంలో రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. ఈ విధంగా రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి రెబ్బలను తిని గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మనం ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.