Ginger Drink : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కంటి చూపు తగ్గడం, కీళ్ల నొప్పులు, రక్తపోటు, అధిక బరువు, శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు చాలా సులభంగా ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ పానీయాన్ని తయారు చేయడం చేసుకోవడం చాలా సులభం. మనకు వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను నయం చేసే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈపానీయాన్ని ఎప్పుడు తాగాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం 50 గ్రాముల అల్లాన్ని, ఒక నిమ్మకాయను, ఒక నారింజకాయను, ఒక టీ స్పూన్ పసుపును, 200 ఎమ్ ఎల్ నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా కడగాలి. తరువాత దానిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. అలాగే నిమ్మరసాన్ని, నారింజ రసాన్ని కూడా జార్ లో వేసుకోవాలి. చివరగా పసుపును, నీళ్లను కూడా పోసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పానీయాన్ని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ పానీయాన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున 15 నుండి 20 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు కూడా తగ్గుతాము.
అలాగే ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ పానీయాన్ని వాడడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం సంరక్షించబడుతుంది. అలాగే ఈ పానీయాన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ పానీయం తయారీలో ఉపయోగించి ప్రతి పదార్థం కూడా సహజ సిద్దమైనదే. అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకు సులభంగా లభించేవే. పైన చెప్పిన విధంగా పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరుకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.