Beauty Tips : ముఖం అందంగా, కాంతివంతంగా, తాజాగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖం అందంగా కనబడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తుంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటారు. అయినప్పటికి మొటిమలు, మచ్చలు, చర్మం నల్లగా మారడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చాలా సులభంగా ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కటి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది. చర్మ సమస్యలన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా తేలిక.
ముఖ సౌందర్యాన్ని మరింత పెంచే ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక టీ స్పూన్ పసుపును, రెండు టీ స్పూన్ల తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక పెనం మీద పసుపును వేసి వేయించాలి. పసుపు రంగు మారిన తరువాత దానిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత కలబంద గుజ్జును ముఖానికి రాసుకుని పడుకోవాలి. ఇలా వారినికి ఒకసారి చేయడం వల్ల ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పసుపు, తేనెలో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి ముఖం పై వచ్చే మొటిమలను, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై ఉండే నలుపు తగ్గుతుంది. అలాగే చర్మంపై ఉండే ముడతలు తొలగిపోతాయి. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా ఉంటాయి. ఈ చిట్కాను వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.