హెల్త్ టిప్స్

‘ గ్రీన్ టీ ‘ తో ఆశ్చ‌ర్య‌పోయే అందం మీ సొంతం..

గ్రీన్ టీ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఎండిపోయిన తేయాకులతో తయారు చేసేదే గ్రీన్ టీ. దీనిని కామెల్లియా సినెన్సిస్‌గా పిలుస్తారు. గుండె సంబంధిత వ్యాధులూ, క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక వత్తిడి, స్థూల కాయం వంటివి నేడు పలువురు యువతీ, యువకులలో కూడా సాధారణం అయ్యాయి. ఈ సమకాలీన రుగ్మతల నివారణకు కొంత మేరకు దివ్య ఔషదమే గ్రీన్ టీ. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు గ్రీన్ టీలో ఉన్నాయని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తుంది. అయితే గ్రీన్ టీతో ఆరోగ్య‌మే కాదు.. అందం కూడా.. ఆశ్చ‌ర్య‌పోతున్నారా? కానీ అది నిజం. గ్రీన్ టీ బ్యాగులతో కూడా అందాన్ని పెంచుకోవచ్చు. సౌందర్యాన్ని పెంపొందించే సాధనాలుగా వాడుకోవచ్చు. గ్రీన్ టీలో చర్మ సంరక్షణకు కావలసినన్ని ఫోలిఫినోల్స్ కలిగి ఉండటం వల్ల చర్మాన్ని ఫ్రెష్ గా, తేమగా ఉండేలా కాపాడుతుంది.వాడేసిన గ్రీన్ టీ బ్యాగులని చల్లని నీటిలో నానబెట్టి వాటిని కళ్ల కింద వచ్చే వాపులకు తగ్గించేందుకు వాడొచ్చు.

green tea is very much useful for beauty

అలసట వల్ల కళ్ల కింద ఉన్న లేత చర్మంపై వాపు వస్తుంది. అలాగే నల్లటి వలయాలు కూడా వస్తాయి. వాటిని తగ్గించేందుకు గ్రీన్ టీ బ్యాగులను వాడుకోవచ్చు. చల్లటి గ్రీన్ టీ బ్యాగుని ముఖంపై మొటిమలు వచ్చే ప్రాంతాల్లో పెట్టుకుంటే మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది. తరచూ గ్రీన్ టీ నీళ్లతో ఫేస్ వాస్ చేసుకుంటే ముఖంపై మురికి వంటివి పోయి మంచి టోన్ పొంద‌వ‌చ్చు. అలాగే గ్రీన్ టీ నీళ్లతో జుట్టుపై పోసుకుని మ‌సాజ్ చేసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.

Admin

Recent Posts