హెల్త్ టిప్స్

ఈ ఫుడ్ కాంబినేష‌న్‌ ఎంత డేంజ‌రో తెలుసా…

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అన్నది అంద‌రికి తెలిసిందే. పోష‌కాహారం తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అలాగే కొన్ని ఆహార కాంబినేష‌న్ల వంట‌కాలు భ‌లే టేస్టీగా మ‌రియు ఆరోగ్యంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. చాలా మంది ఆ కాండినేష‌న్లు లేక‌పోతే తిన‌డానికే ఇష్ట‌ప‌డ‌రు.అయితే, కొన్ని కాంబినేష‌న్లు ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా క్రమేనా విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. మరి ఆ డేంజరస్ కాంబినేషన్ ఆహార పదార్థాలేమిటో చూద్దామా…

– నిమ్మకాయ, పాలు క‌లిపి ఎప్పుడూ తీసుకోకూడ‌వు. కడుపులో ఉండే జీర్ణ రసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ క‌డుపులో విషంగా మారే ప్రమాదం ఉంది.

– పెరుగు, పండ్లు క‌లిపి తీసుకోకూడ‌దు. సిట్ర‌స్ పండ్లు పెరుగుతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపుతుంది.

these food combinations are very dangerous to health

– మ‌జ్జిగ‌-అర‌టిపండు, న‌ల్ల మిరియాలు-చేప‌లు, పెరుగు-ఖ‌ర్జూరాలు, పాలు-మ‌ద్యం ఇలాంటి కాంబినేష‌న్‌ల‌లో ఫుడ్ తిన‌డం అంత మంచిది కాదు.

– అర‌టిపండు, పాలు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియపై చెడుప్రభావం చూపుతుంది. అలాగే అరటిపండుని పాలతో తీసుకుంటే జఠరాగ్ని తగ్గిపోతుందని, విషాలు ఉత్పత్తి అవుతాయని, దగ్గు, జలుబు, అలర్జీలు, సైనస్‌ సమస్యలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

– టీ, పెరుగు ఒకేసారి తీసుకోకూడ‌దు. ఈ రెండిట్లోను యాసిడ్స్ ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సమతుల్యత కోల్పోతుంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతోంది.

– కీర‌దోస‌, ట‌మాటాలు, పెరుగు, వంటి వాటితో నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి తీసుకోకూడ‌దు. లేదంటే క‌డుపులో అసిడిటీ ఎక్కువైపోయి గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Admin

Recent Posts