చాలా మంది అరటి పండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. వాటిని తినడం వల్ల మనకు పోషకాలు లభించడమే కాదు, శక్తి కూడా అందుతుంది. అయితే కేవలం అరటి పండే కాదు, అరటి పువ్వు కూడా మనకు మేలు చేస్తుంది. దాన్ని చాలా మంది కూరగా వండుకుని తింటుంటారు. అరటి పువ్వును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరటి పువ్వు డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం తరచూ అరటి పువ్వును తినడం వల్ల డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
2. అరటి పువ్వులో మెగ్నిషియం ఉంటుంది. ఇది మూడ్‌ను మారుస్తుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. డిప్రెషన్‌ను దూరం చేస్తుంది.
3. అరటి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలు దెబ్బ తినకుండా చూస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
4. కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉన్నవారు అరటి పువ్వును వండుకుని తింటే ప్రయోజనం కలుగుతుంది.
5. అరటి పువ్వుల్లో ఉండే ఔషధ గుణాలు సూక్ష్మ క్రిములను చంపేస్తాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు.
6. మహిళలు రుతు సమయంలో అరటి పువ్వును తీసుకుంటే నొప్పి, అధిక రక్తస్రావం తగ్గుతాయి. పీసీవోఎస్ సమస్య ఉన్నవారు అరటి పువ్వును తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది.
7. అరటి పువ్వును తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది.
8. పాలిచ్చే తల్లులు అరటి పువ్వును తింటుండడం వల్ల వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365