మనలో చాలా మందికి సాబుదానా అంటే తెలుసు. వీటినే సగ్గు బియ్యం అని కూడా అంటారు. వీటితో అనేక రకాల పిండి వంటలు చేస్తుంటారు. అయితే నిజానికి సగ్గు బియ్యంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
సగ్గు బియ్యంలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మనకు శక్తిని, పోషకాలను అందిస్తాయి. చాలా మంది సగ్గు బియ్యం తినరు. కానీ వీటిని రోజూ తినాల్సిన ఆహారాల జాబితాలో చేర్చుకోవాలి. వీటిని తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
1. సగ్గు బియ్యం తినడం వల్ల కండరాలు నిర్మాణమవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువగా చేసే వారికి సగ్గుబియ్యం ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి కండరాలకు మరమ్మత్తులు చేయడంతోపాటు శక్తిని అందిస్తాయి. దీంతో బాగా అలసిపోయిన వారు వీటిని తీసుకుంటే వెంటనే శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు.
2. సగ్గు బియ్యంలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది.
3. జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారికి సగ్గు బియ్యం ఎంతగానో మేలు చేస్తాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, విరేచనాల వంటి సమస్యలు ఉన్నవారు సగ్గు బియ్యం తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థపై సగ్గుబియ్యం చల్లని ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక కడుపులో మంట తగ్గుతుంది.
4. సగ్గు బియ్యం తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ట్రై గ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
5. గర్భంతో ఉన్న మహిళలు సగ్గు బియ్యాన్ని రోజూ తీసుకోవాలి. దీంతో శిశువుకు పోషణ సరిగ్గా లభిస్తుంది. బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా పుడతారు. సగ్గు బియ్యంలో ఉండే ఫోలేట్ బిడ్డకు ఎలాంటి లోపాలు రాకుండా చూస్తుంది. అందువల్ల గర్భిణీలు సగ్గు బియ్యాన్ని రోజూ తీసుకోవాలి.
6. సగ్గు బియ్యంలో పొటాషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడడమే కాక హైబీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.