నువ్వుల నూనె ఎంతో ప్ర‌యోజ‌న‌కారి.. అనేక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది..!

మ‌న‌కు వంట‌లు వండేందుకు, శ‌రీర సంర‌క్ష‌ణ‌కు అనేక ర‌కాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే మ‌నం రోజూ వాడే వంట నూనెలు కేవ‌లం వంట‌కే ప‌నికొస్తాయి కానీ దాదాపుగా ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌వ‌నే చెప్ప‌వ‌చ్చు. క‌నుక కేవ‌లం వంట‌ల‌కే కాకుండా వాటితో మ‌న‌కు ప్ర‌యోజనాలు క‌లిగేలా ఉండే నూనెల‌ను వాడాలి. అలాంటి నూనెల్లో నువ్వుల నూనె ఒక‌టి. దీంతో మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటంటే..

health benefits of sesame oil

1. నువ్వుల నూనె చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. ఈ నూనెలో విట‌మిన్లు బి, ఇ లు ఉంటాయి. ఇవి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల ముఖం తాజాగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. ముఖంపై ఉండే మచ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గుతాయి.

2. చిన్నారుల‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు నువ్వుల నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో ఉండే విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. ఈ నూనెలోని విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. దీంతో వారు బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. చిన్నారుల‌కు వారానికి ఒక‌సారి నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేసి స్నానం చేయించాలి. దీంతో వారు హాయిగా నిద్ర‌పోతారు. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చిన్నారుల మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. వెన్నెముక‌, కండ‌రాలు బ‌లంగా మారుతాయి.

3. నువ్వుల నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి పిల్ల‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. పెద్ద‌ల్లో బీపీని నియంత్రిస్తాయి. గుండెను సంర‌క్షిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి.

4. నువ్వుల్లో కాప‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి. ఈ నూనెలో ఖ‌నిజాలు ర‌క్త‌నాళాల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించి వాటిని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. శ్వాస‌కోశ వ్యాధుల‌ను త‌గ్గిస్తాయి. ఈ నూనెలోని మెగ్నిషియం పేగు క్యాన్స‌ర్‌ను రాకుండా చూస్తుంది. త‌ల‌నొప్పి రాకుండా కాపాడుతుంది. నువ్వుల నూనెలో ఉండే కాల్షియం, జింక్‌లు ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

5. డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు నువ్వుల నూనెను వాడ‌డం మంచిది. దీంతో వారి బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

6. నువ్వుల నూనెను వాడ‌డం వ‌ల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు స‌మ‌స్య ఉండ‌దు. నువ్వుల నూనెతో త‌ల‌ను మ‌ర్ద‌నా చేసి కొంత సేప‌టి త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే శిరోజాల స‌మ‌స్య‌లు ఉండ‌వు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts