Health Tips : దీన్ని ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆహారం మొత్తం దెబ్బ‌కు జీర్ణ‌మ‌వుతుంది..!

Health Tips : అజీర్ణ స‌మ‌స్య చాలా మందిని స‌హ‌జంగానే ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోతే వ‌చ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వస్తుంటాయి. క‌నుక ఆహారం స‌రిగ్గా జీర్ణం కావాల్సిందే. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేద‌ని.. క‌డుపు అంతా ఉబ్బ‌రంగా ఉంద‌ని భావించే వారు.. కింద తెలిపిన విధంగా ఒక జ్యూస్‌ను త‌యారు చేసుకుని దాన్ని ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. దీంతో జీర్ణ వ్య‌వ‌స్థలో ఉండే ఆహారం మొత్తం దెబ్బ‌కు జీర్ణ‌మ‌వుతుంది. మ‌రి ఆ జ్యూస్‌ను ఎలా త‌యారు చేయాలంటే..

Health Tips  drink pineapple and carrot and mint juice for digestion
Health Tips

పైనాపిల్ పండు స‌గం తీసుకుని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. అలాగే ఒక క్యారెట్‌ను తీసుకుని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. గుప్పెడు పుదీనా ఆకుల‌ను కూడా క‌ట్ చేయాలి. అనంత‌రం అన్నింటినీ క‌లిపి మిక్సీలో వేసి జ్యూస్‌లా ప‌ట్టుకోవాలి. ఈ విధంగా త‌యారు చేసుకున్న జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ‌ర‌సం పిండి అనంత‌రం ఈ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగాలి.

ఇలా జ్యూస్‌ను త‌యారు చేసుకుని భోజ‌నం చేసిన త‌రువాత ఒక గంట స‌మ‌యం ఇచ్చి తాగాల్సి ఉంటుంది. దీన్ని రోజుకు రెండు సార్లు మ‌ధ్యాహ్నం, రాత్రి తాగ‌వ‌చ్చు. ఇలా ఒక రోజు తాగితే చాలు.. దెబ్బ‌కు పొట్ట‌లో ఉండే ఆహారం మొత్తం జీర్ణ‌మ‌వుతుంది. మ‌రుస‌టి రోజు మ‌ల‌బ‌ద్ద‌కం లేకుండా సుల‌భంగా విరేచ‌నం అవుతుంది. అలాగే పొట్టంతా క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. గ్యాస్ స‌మ‌స్య ఉండ‌దు.

Share
Admin

Recent Posts