Mohan Lal : ఈ మధ్య కాలంలో అగ్ర హీరోల సినిమాలు కూడా నెల తిరిగే లోపు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలలో సినిమాలను చూసేందుకు బాగా అలవాటు పడ్డారు. కరోనా పుణ్యమా అని ఓటీటీ యాప్‌లు పండుగ చేసుకుంటున్నాయి. గతంలో కొత్త సినిమా అంటే టీవీలోనే వచ్చేది. అది కూడా చాలా రోజులకు ప్రసారం చేసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో సినిమాలు ముందుగా ఓటీటీలకే వస్తున్నాయి. ఇక తాజాగా మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రం ఆరాట్టు కూడా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఆరాట్టు చిత్రానికి ఉన్ని కృష్ణ దర్శకత్వం వహించారు. పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రాన్ని తెరక్కెకించారు. ఫిబ్రవరి 18న ఈ సినిమాను థియేటర్‌లలో విడుదల చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసి భూమిని తీసుకున్న రియల్ ఎస్టేట్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో మోహన్‌లాల్ పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపించారు.
అయితే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న వసూళ్లను రాబట్టలేదు. కాగా థియేటర్‌లలో విడుదలైన ప్రతి సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో కూడా విడుదలై సందడి చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుంది. ఆరాట్టు సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే మార్చి 20వ తేదీన ఆరాట్టు సినిమా స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రకటించింది. ఈ సినిమాలో మోహన్‌లాల్ తోపాటు శ్రద్దా శ్రీనాథ్, రామ చంద్ర రాజు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.