Sabja Seeds : ప్రస్తుత తరుణంలో ఊబకాయం సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, శారీరక శ్రమ లేకపోవడం, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం.. వంటి కారణాల వల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరు బరువు తగ్గరు. అధిక బరువును, బాన పొట్టను మనం చాలా సులువుగా తగ్గించుకోవచ్చు.
అధిక బరువు సమస్య నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి మన ఆరోగ్యం కోసం అనేక రకాల మొక్కలను ప్రసాదించింది. వాటిల్లో సబ్జా గింజల మొక్క కూడా ఒకటి. దీనిని ఆంగ్లంలో బెసిల్ అని అంటారు. సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ గింజలను నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ఇవి విస్తరించి తెల్లగా మారిన తరువాత ఆ నీటిని.. ఆహారం తీసుకోవడానికి ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల కడును నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటాం. సబ్జా గింజల పానీయాన్ని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల తక్కువ సమయంలోనే అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల స్త్రీలకు ఎంతో మేలు కలుగుతుంది.
సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. సబ్జా గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. దగ్గు, తలనొప్పి, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడే వారు సబ్జా గింజల నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ విధంగా బరువు తగ్గడంతోపాటు మనకు వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా సబ్జా గింజలు మనకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.