Chukka Kura : మనం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో ఆకుకూరలు కూడా ఒకటి. మనకు వివిధ రకాల ఆకుకూరలు లభిస్తూ ఉంటాయి. ఆకుకూరలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో చుక్కకూర కూడా ఒకటి. చుక్కకూర మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తుంది. దీంతో మనం ఎక్కువగా పచ్చడి, పప్పు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. చుక్కకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు చుక్కకూరను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గడంలో కూడా చుక్కకూర మనకు సహాయపడుతుంది.
చుక్క కూరలో అధికంగా ఉండే పీచు పదార్థాలు తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంలో దోహదపడుతాయి. దీంతో మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. చుక్కకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. రేచీకటి సమస్యతో బాధపడే వారు చుక్కకూరను తినడం వల్ల క్రమంగా సమస్య తగ్గు ముఖం పడే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా చుక్కకూర ఆకులకు ఉంటుంది. ఒక ఔన్స్ చుక్క కూర రసాన్ని పెరుగులో కలుపుకుని మూడు రోజుల పాటు తీసుకోవడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గు ముఖం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక ఔన్స్ చుక్క కూర రసంలో చిటికెడు వంటసోడాను కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గు ముఖం పడతాయి. తరచూ రోగాల బారిన పడే వారు చుక్క కూరను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. జుట్టు రాలడం సమస్యతో బాధపడే వారు చుక్కకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా చుక్కకూరను తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కనుక దీన్ని తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.