High BP Side Effects : మీకు హైబీపీ ఉందా.. అయితే కంట్రోల్ చేయాల్సిందే.. లేదంటే ఎన్ని అన‌ర్థాలు జ‌రుగుతాయో తెలుసా..?

High BP Side Effects : ప్ర‌స్తుత త‌రుణంలో ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది హైబీపీ బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, నిద్ర‌లేమి, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, పొగ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, స‌రైన టైముకు భోజ‌నం చేయ‌డం, క్యాల‌రీలు అధికంగా ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హైబీపీ వ‌స్తోంది. అయితే హైబీపీ స‌మ‌స్య‌ను వెంట‌నే కంట్రోల్ చేయాలి. లేదంటే అనేక అన‌ర్థాలు సంభ‌విస్తాయి. హైబీపీ కంట్రోల్ అవ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

హైబీపీ కంట్రోల్ అవ‌క‌పోతే అలాంటి వారికి హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. ఇందుకు కార‌ణం ఏమిటంటే.. హైబీపీ వ‌ల్ల ర‌క్తనాళాల గోడ‌లు డ్యామేజ్ అవుతాయి. దీంతో అక్క‌డ వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. ఇది హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్‌కు కార‌ణ‌మ‌వుతుంది. ఇక హైబీపీ కంట్రోల్ అవ‌క‌పోతే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే చాన్స్ కూడా ఉంటుంది. గుండె పంప్ చేసే సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది.

High BP Side Effects must control it or else your health will become problem
High BP Side Effects

ఇక హైబీపీ ఉన్న‌వారికి శృంగార సామర్థ్యం కూడా త‌గ్గిపోతుంది. వారు శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొన‌లేరు. ముఖ్యంగా పురుషుల్లో అయితే అంగ‌స్తంభ‌న స‌మ‌స్య వ‌స్తుంది. ఇక హైబీపీ ఉన్న‌వారికి త‌ర‌చూ ఛాతిలో నొప్పిగా ఉంటుంది. దీన్ని వారు గ్యాస్ నొప్పి అని కూడా భ్ర‌మిస్తారు. ఇలా గ‌న‌క జ‌రిగితే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్టర్‌ను క‌ల‌వాలి.

హైబీపీ ఉన్న‌వారు దాన్ని కంట్రోల్ చేయ‌లేక‌పోతే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే చాన్సులు కూడా ఉంటాయి. అలాగే కంటి చూపు స‌మ‌స్య వ‌స్తుంది. క‌నుక బీపీని కంట్రోల్ చేయాలి. ఎల్ల‌ప్పుడూ కంట్రోల్‌లో ఉంచాలి. దీంతో ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అన్ని ర‌కాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Editor

Recent Posts