హెల్త్ టిప్స్

Honey And Lemon In Winter : చ‌లికాలంలో రోజూ ప‌ర‌గ‌డుపునే తేనె, నిమ్మ‌ర‌సం తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Honey And Lemon In Winter : తేనే, నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలామంది ఉదయాన్నే, తేనే, నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు. నిజానికి మనం తీసుకునే ఆహారం బట్టి, మన ఆరోగ్యం ఉంటుంది. అందుకని, ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యానికి తేనె, నిమ్మరసం ఎంతో బాగా ఉపయోగపడతాయి. తేనే, నిమ్మరసం తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. చలికాలంలో ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.

చలికాలంలో మంచి ఆహారం ని తీసుకుంటే, చాలా రకాల సమస్యల్ని దూరం చేస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. తేనె, నిమ్మరసంలో సహజ సిద్ధమైన హీలింగ్ గుణాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి, తేనె నిమ్మరసం సహజ స్థితమైన వైద్యంలో వాడడం జరుగుతోంది. ఉదయం పరగడుపున దీన్ని తీసుకుంటే చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది.

Honey And Lemon In Winter many wonderful health benefits

తేనే, నిమ్మరసం రెండిట్లో చక్కటి గుణాలు ఉంటాయి. కాబట్టి, పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. నిమ్మలోని ఆమ్లం, జీర్ణక్రియలో సహాయపడే వ్యర్థాలని బయటకి పంపిస్తుంది. ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తాయి. జీర్ణం కాని ఆహారం పేగు కణాల మరియు చనిపోయిన బ్యాక్టీరియా ప్రొడక్షన్ కారణంగా తరచూ కడుపు లోపల పేరుకుపోతుంది. దాంతో వివిధ సమస్యలు వస్తాయి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ, తేనే కలిపి తీసుకుంటే పేగు యొక్క గోడలు ముఖ్యంగా పెద్ద పేగు ఉత్తేజితమవుతుంది. విషాలును బయటికి పంపిస్తుంది.

ఆహారం బాగా జీర్ణం అయ్యేటట్టు కూడా ఇది చూస్తుంది. మలబద్ధకం సమస్య కూడా రాకుండా చూస్తుంది. ఉదయం పరగడుపున తేనే, నిమ్మరసం తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నట్లయితే సమస్య పెరిగిపోతుంది. అయితే, తేనె ని ఉపయోగించేటప్పుడు ఆర్గానిక్ ని మాత్రమే వాడండి అంతేకానీ కెమికల్స్ ఉండే వాటిని ఉపయోగించవద్దు. దాని వలన నష్టాలే తప్ప, ఫలితం ఉండదు. అలానే దీన్ని తాగిన గంట వరకు కూడా కాఫీ, టీ లను తీసుకోవద్దు.

Admin

Recent Posts