Viral Video : వారెవ్వా.. ముఖం కనిపించ‌కుండా ముసుగు వేసుకున్నా.. త‌ల్లిని గుర్తు ప‌ట్టిన బుడ్డోడు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : చిన్న‌పిల్ల‌ల‌తో మ‌నం ఏం చేసినా అది స‌ర‌దాగానే ఉంటుంది. వారు ఆ వ‌య‌స్సులో చేసే ప‌నులు మ‌న‌కు ఎంతో న‌వ్వును తెప్పిస్తుంటాయి. దీంతో వారు చేసే ప‌నుల‌ను చూస్తుంటే ముచ్చ‌టేస్తుంటుంది. అయితే ఆ వ‌య‌స్సులోనూ వారు త‌మ తల్లిదండ్రులను ఎలా ఉన్నా సుల‌భంగా గుర్తు ప‌ట్టేస్తారు. త‌మ త‌ల్లిదండ్రుల మాట‌, శ‌రీరాకృతి తదిత‌ర విష‌యాలు పిల్ల‌ల‌కు బాగా తెలుస్తాయి. అందుక‌నే వారు త‌మ అమ్మా, నాన్న‌ల‌ను సుల‌భంగానే గుర్తిస్తుంటారు. ఇక స‌రిగ్గా ఇలాంటిదే ఒక సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

Viral Video kid identifies even his mother covered her face
Viral Video

ఒక గ‌దిలో న‌లుగురు మ‌హిళ‌లు ఒకేలాంటి చీర‌ను ధ‌రించి కూర్చున్నారు. అంద‌రూ ఎల్లో ఆరెంజ్ క‌ల‌ర్ చీర‌ల‌ను ధ‌రించారు. అలాగే ముఖంపై చీర‌తో క‌నిపించ‌కుండా క‌ప్పుకున్నారు. త‌రువాత ఆ గ‌దిలోకి ఓ బుడ్డోడు ఎంట‌ర్ అయ్యాడు. ఈ క్ర‌మంలో వారంద‌రూ నా ద‌గ్గ‌రి రా.. అంటే.. నా ద‌గ్గ‌రికి రా.. అని ఆ బాలున్ని పిలిచారు. ఈ క్ర‌మంలో అత‌ను ఓ దశ‌లో క‌న్‌ఫ్యూజ్ అయ్యాడు. ముందుగా ఒక మ‌హిళను త‌న త‌ల్లి అనుకుని ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా.. వెంట‌నే ఆమె త‌న త‌ల్లి కాద‌ని గుర్తించి అక్క‌డి నుంచి మ‌ళ్లీ ఇంకో మ‌హిళ వ‌ద్ద‌కు వెళ్లాడు. దీంతో ఎట్ట‌కేల‌కు త‌న త‌ల్లిని అత‌ను గుర్తు ప‌ట్టాడు. కాగా ఆ స‌మ‌యంలో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా.. ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

కాగా ఈ వీడియోకు ఇప్ప‌టికే 1.8 కోట్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. 6.60 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎంతో మంది ఆ బుడ్డోడి తెలివిని మెచ్చుకుంటున్నారు. అత‌న్ని అభినందిస్తున్నారు.

Editor

Recent Posts