హెల్త్ టిప్స్

ఒక వ్య‌క్తి త‌న శ‌రీర బ‌రువును బ‌ట్టి రోజుకు ఎన్ని లీట‌ర్ల నీళ్ల‌ను తాగాలంటే..?

మానవ శరీరంలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు నీరే ఉంటుంది. ఏ అవయవం పనిచేయాలన్నా నీటి అవసరం ఎక్కువ. వ్యాధులు మన ద‌రి చేరకుండా ఉండాలంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. అయితే ఎంత బరువున్న వ్యక్తి ఎంత మొత్తంలో నీటిని తాగాలనే విషయంపై ఓ జనరల్ ఫార్ములా ఉంది. ఈ సూత్రాన్ని అనుసరించి మీ బరువును బట్టి మీరు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో తెల్సుకోవ‌చ్చు.

ఓ వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి అంటే.. ఆ వ్య‌క్తి బ‌రువును 10 తో భాగించాలి. ఆ వ‌చ్చిన మొత్తం లోంచి 2 ను తీసేయాలి. దీన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకుంటే.. ఉదాహరణకు 60 KG ల బరువున్న వ్యక్తి తాగాల్సిన నీటి పరిమాణం ఎంత అవుతుంది అంటే.. ముందుగా అత‌ని బ‌రువును 10తో భాగించాలి. దీంతో 6 వ‌స్తుంది. అందులో నుంచి 2 తీసేయాలి. అప్పుడు 4 వ‌స్తుంది. అంటే 60 కేజీల బ‌రువు ఉన్న వ్య‌క్తి రోజుకు సుమారుగా 4 లీట‌ర్ల నీళ్ల‌ను తాగాల‌న్న‌మాట‌.

how much water we have to drink per day according to body weight

ఇక 70 కిలోలు ఉంటే 5 లీట‌ర్లు, 80 కిలోలు ఉంటే 6 లీట‌ర్లు.. ఇలా శ‌రీర బ‌రువు పెరిగే కొద్దీ రోజూ తాగాల్సిన నీటి ప‌రిమాణం కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఎవ‌రికి వారు త‌మ శ‌రీర బ‌రువుతో ఈ విధంగా ఫార్ములాను ఉప‌యోగించి లెక్కిస్తే తాము రోజూ తాగాల్సిన నీటి ప‌రిమాణం ఎంతో వ‌స్తుంది. దీంతో రోజూ ఆ నీళ్ల కోటాను పూర్తి చేస్తే చాలు, ఆరోగ్యంగా ఉంటారు.

Admin

Recent Posts