హెల్త్ టిప్స్

కూరగాయలపై మాలకైట్‌ గ్రీన్‌ ఉందో, లేదో తెలుసుకునేందుకు ఇలా టెస్ట్ చేయవచ్చు..!

బయట కిరాణా షాపులు లేదా సూపర్‌ మార్కెట్లలో మనం కొనే నిత్యావసర వస్తువుల్లో కల్తీ జరిగితే కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వాటిని గుర్తించవచ్చు. అయితే మీకు తెలుసా ? కూరగాయలు, పండ్లను కూడా కల్తీ చేస్తారు. అంటే.. అవి ఆకర్షణీయంగా కనిపించడం కోసం వాటిపై పలు రకాల రసాయనాలను రాయడమో లేదా స్ప్రే చేయడమో చేస్తారన్నమాట. ఇక ప్రస్తుత తరుణంలో కూరగాయలను ఇలా కల్తీ చేస్తున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కల్తీ జరిగే కూరగాయలను.. ముఖ్యంగా బెండకాయలను గుర్తించేందుకు ఓ పరీక్షను తెలియజేసింది. బెండకాయలపై మాలకైట్‌ గ్రీన్‌ అనే సమ్మేళనం కలిసిందో లేదో గుర్తించేందుకు ఇలా టెస్టు చేయవచ్చు.

how to know whether malachite green in vegetables

ఒక కాటన్‌ పీస్‌ను లిక్విడ్‌ పారాఫిన్‌లో నానబెట్టి దాన్ని బెండకాయపై గ్రీన్‌ గా ఉండే చోట రుద్దాలి. కాటన్‌ పీస్ పై ఎలాంటి కలర్‌ లేకపోతే అది కల్తీ కాలేదని అర్థం. అదే కాటన్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారితే అది కల్తీ అయిందని అర్థం. అందుకు గాను మాలకైట్‌ గ్రీన్‌ను వాడారని అర్థం చేసుకోవాలి.

మాలకైట్‌ గ్రీన్‌ అనేది ఒక టెక్స్ టైల్‌ డై. దీన్ని చేపలకు యాంటీ ప్రొటోజోవల్‌, యాంటీ ఫంగల్‌ మెడిసిన్‌గా కూడా ఉపయోగిస్తారు. అలాగే పలు ఇతర రంగాల్లోనూ దీన్ని వాడుతారు. కానీ ఆహార పదార్థాలపై దీన్ని వాడితే డేంజర్. మనకు అలాంటి ఆహారాలతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక మాలకైట్‌ గ్రీన్ అనేది కూరగాయలపై ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పై విధంగా టెస్ట్‌ చేయవచ్చు. దీంతో కూరగాయలు కల్తీ అయ్యాయా, లేదా అనే విషయం తెలిసిపోతుంది.

Admin

Recent Posts