lifestyle

సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను తినాల‌నుకుంటున్నారా ? ఎన్ని నిమిషాల పాటు ఉడికించాలో తెలుసుకోండి..!

కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కొంద‌రు బాయిల్డ్ ఎగ్స్‌ను తింటే కొంద‌రు ఆమ్లెట్ రూపంలో తింటారు. అయితే గుడ్డు ద్వారా ఎక్కువ ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వాటిని ఉడ‌క‌బెట్టి తినాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను తింటుంటారు. అయితే సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ స‌రిగ్గా రావాలంటే గుడ్లను ఎంత సేపు ఉడికించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా సేపు గుడ్ల‌ను ఉడ‌క‌బెడితే అవి బాగా బాయిల్ అవుతాయి. దీంతో వాటిని హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అంటారు. అయితే సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్‌లో ప‌చ్చ సొన క్రీమ్ రూపంలో ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అవి స‌రిగ్గా రావాలంటే వాటిని 4 నిమిషాల 25 సెక‌న్ల పాటు క‌చ్చితంగా ఉడికించాలి. ఒక సెక‌ను అటు, ఇటు కాకుండా అంతే స‌మ‌యం మేర ఉడ‌క‌బెట్టాలి. దీంతో అవి ప‌ర్‌ఫెక్ట్ సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ లా వ‌స్తాయి.

if you want to eat eggs know how many minutes you have to boil them

ఇక అలా బాయిల్ అయిన గుడ్ల‌ను ప‌గ‌ల‌గొట్టే ముందు వాటిని క‌చ్చితంగా 57 సెక‌న్ల పాటు చ‌ల్ల‌ని నీటిలో ఉంచాలి. దీంతో పొట్టు స‌రిగ్గా వ‌స్తుంది. సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్ స‌రిగ్గా వ‌స్తుంది. ఈ విధంగా సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను ఉడికించాలి. ఈ వివ‌రాల‌ను ఇంగ్లండ్‌లోని నాటింగామ్ యూనివ‌ర్సిటీకి చెందిన డాక్ట‌ర్ జేమ్స్ హిండ్ అనే ప్రొఫెస‌ర్ వెల్ల‌డించారు. క‌నుక ఎవ‌రైనా స‌రే సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ను ఉడికించి తిన‌ద‌లిస్తే పైన చెప్పిన విధంగా ఉడ‌క‌బెట్ట‌డం మేలు.

Admin

Recent Posts