హెల్త్ టిప్స్

Upavasam : ఉపవాసం ఉండేవాళ్ళు వీటిని కచ్చితంగా పాటించాలి.. అప్పుడే ఫలితం ఉంటుంది..!

Upavasam : చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు. పర్వదినాలప్పుడు కానీ లేదంటే వారానికి ఒకసారి అని కానీ, చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసాలు చేసేటప్పుడు కొన్ని విషయాలని కచ్చితంగా పాటించాలి. ఏం చేయాలన్నా కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఉపవాసానికి కూడా కొన్ని రోజులు ఉన్నాయి. ఉపవాసం చేసేటప్పుడు తప్పులు చేయడం వలన, ఉపవాసం చేసిన ఫలితం ఉండదు. మీరు అనుకున్న పనులు జరగవు. కోరికలు నెరవేరవు.

ఉపవాసానికి సంబంధించిన ఒక విషయాన్ని కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఉపవాసం సమయంలో, అసలు నిద్రపోకూడదు. ఉపవాసం చేసే వాళ్ళు నిద్రపోతే, దాని ఫలితం ఏమీ ఉండదు. కాబట్టి, క‌చ్చితంగా ఉపవాసం చేసిన రోజు నిద్రపోకండి. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, ఉపవాసం మొదలు పెట్టాలి. ఆలస్యంగా నిద్ర లేవడం వంటివి మంచివి కావు. బ్రహ్మ ముహూర్తంలో తల‌ స్నానం చేసి ఆ తర్వాత దేవుడికి దీపం పెట్టుకొని ఉపవాసాన్ని మొదలుపెట్టడం మంచిది.

if you are doing fasting then follow these

నిర్జల ఉపవాసం, జలోపవాసం, రసోపవాసం, ఫలోపవాసం ఇలా నాలుగు రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఈ నాలుగు ఉపవాసాలు కూడా శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. మీకు ఏది వీలైతే, ఆ ఉపవాసాన్ని ఆచరించవచ్చు. జల ఉపవాసం అంటే, కేవలం నీళ్లు మాత్రమే తాగాలి. ఆహార పదార్థాలు ఏమి తీసుకోకూడదు. ఐదు లీటర్ల వరకు నీళ్లు తాగొచ్చు. ఉదయాన్నే పరగడుపున ఒక లీటర్ నీటిని తీసుకుని, ప్రతి రెండు గంటలకి ఒక రెండు గ్లాసుల‌ నీళ్లు తాగాలి.

రసోపవాసం అంటే, మీరు పండ్లని తీసుకోవచ్చు. పండ్లతో ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం చేయడానికి ముందు, ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని, దేవుడికి దీపం పెట్టుకుని మీరు చేసే పద్ధతిలో పూజ చేసేసి ఉపవాసాన్ని మొదలుపెట్టాలి. శుభ్రమైన, ఉతికిన బట్టలను మాత్రమే కట్టుకోవాలి. నల్ల రంగు బట్టలు వేసుకోకూడదు. వీలైతే తెలుపు, పసుపు, పచ్చని బట్టలు వేసుకోవడం మంచిది. ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా, కోపానికి గురవకుండా మంచి ఆలోచనలతో ఉపవాసం చేస్తే మంచిది.

Admin

Recent Posts