Bald Head : ప్రస్తుత తరుణంలో బట్టతల సమస్య అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. బట్టతలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే బట్టతల వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వంశ పారంపర్యంగా కాకుండా కొందరికి పలు ఇతర కారణాల వల్ల కూడా బట్టతల వస్తోంది. జుట్టు క్రమ క్రమంగా రాలిపోతూ చివరకు బట్టతల మిగులుతుంది. అయితే బట్టతల వచ్చేందుకు కొందరు వారు చేసే తప్పులు కూడా కారణమవుతుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తడి జుట్టుతో కొందరు తల దువ్వుతుంటారు. సాధారణంగా మన జుట్టుకు తడి ఉంటే జుట్టు బలహీనంగా మారుతుంది. అలాంటి సమయంలో తలను దువ్వితో జుట్టు మరింత రాలుతుంది. ఇది బట్టతలకు కారణమవుతుంది. కనుక ఈ తప్పును చేయరాదు. ఇక ప్రస్తుత తరుణంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళనలతో సతమతం అవుతున్నారు. బట్టతల వచ్చేందుకు ఇది కూడా కారణమవుతోంది. కనుక ఆ రెండింటినీ తగ్గించుకోవాలి. అలాగే కొందరు అవసరం లేకున్నా ఎల్లప్పుడూ టోపీలను ధరిస్తారు. దీని వల్ల జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. ఫలితంగా బట్టతల వస్తుంది. కనుక బయటకు వెళ్లినప్పుడు లేదా అవసరం అనుకుంటేనే టోపీని ధరించాలి. లేదంటే జుట్టు రాలుతుంది.
ఇక కొందరు రోజూ తలస్నానం చేస్తారు. ఇది మంచిదే. కానీ రసాయనాలతో కూడిన షాంపూలను వాడడం వల్ల జుట్టు బాగా రాలుతుంది. కనుక షాంపూలకు బదులుగా కుంకుడు కాయ, శీకాయ వంటి వాటిని వాడాలి. ఇవి జుట్టును సంరక్షిస్తాయి. షాంపూలను వాడడం తగ్గించాలి. అలాగే జుట్టుకు తరచూ రంగు వేసినా కొంత కాలానికి బట్టతల వస్తుంది. కనుక హెయిర్ డైలను అంతగా వాడరాదు. అలాగే కొందరు కొబ్బరినూనె లేదా బాదం నూనెను జుట్టుకు రాయరు. బట్టతల వచ్చేందుకు ఇది కూడా కారణమే. కనుక ఈ తప్పు చేయరాదు. వారంలో కనీసం 3 సార్లు తలకు నూనె రాయాలి. తరువాత 2 గంటలు ఉండి తలస్నానం చేయాలి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. బట్టతల రాకుండా ఉంటుంది.
కొందరికి పొగ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కొందరు విపరీతంగా మద్యం సేవిస్తారు. ఈ రెండు అలవాట్లు కూడా జుట్టుకు హాని చేస్తాయి. కనుక జుట్టు రాలకుండా ఉండాలంటే.. వీటిని మానుకోవాలి. అలాగే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. కోడిగుడ్లు, పాలకూర, బాదం పప్పు, పిస్తాపప్పు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, పాలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రోటీన్లు బాగా లభిస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి. కనుక ఈ ఆహారాలను తీసుకుంటూ పైన తెలిపిన విధంగా సూచనలను పాటిస్తే.. బట్టతల రాకుండా నియంత్రించవచ్చు. దీంతోపాటు అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.