హెల్త్ టిప్స్

Tea And Coffee : నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగుతున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

Tea And Coffee : మనలో చాలామందికి ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక కప్పు టీ లేదా కాఫీని తాగనిదే అస్సలు బుర్ర పనిచేయదు. ఉదయాన్నే ఛాయ్ లేదా కాఫీని సేవించడం వల్ల ఆ రోజును ఫ్రెష్‌గా ప్రారంభించడానికి వీలుంటుందనేది చాలా మంది ఫీలింగ్. అయితే తెనీరు వల్ల ఫ్రెష్‌ ఫీలింగ్ మాత్రమే కాకుండా వాటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. టీ లేదా కాఫీలు పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదనేది అతి ముఖ్యం. పరగడుపున ఎట్టి పరిస్థితుల్లోనూ టీ, కాఫీలు సేవించకూడదు.

వాస్తవానికి పరగడుపున టీ, కాఫీలు సేవించడం వల్లన రోజంతా అలసటగా ఉంటుందట. అదే సమయంలో మానసికంగా ఒత్తిడి, చికాకు ఉంటాయి. అంతేకాదు పరగడుపు టీ, కాఫీల కారణంగా వికారం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య వెంటాడుతుంది. నరాల సమస్య ఉంటుంది. పరగడుపున టీ, కాఫీలు తీసుకుంటే.. కడుపులో ఉంటే గుడ్ బ్యాక్టీరియా దెబ్బ తింటుంది. ఫలితంగా ఇది జీర్ణ వ్యవస్థపై అధిక ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు..యూరిన్ ఇన్‌ఫెక్షన్ కొత్త సమస్యగా మారుతుంది. ఎందుకంటే శరీరంలో నీరు లేకపోవడం, డీ హైడ్రేషన్ కారణంగా ఇది జరుగుతుంది.

if you are drinking tea and coffee upon wakeup then know this

ఉదయం వేళల్లో పరగడుపున టీ, కాఫీలు తీసుకుంటే.. ఎసిడిటీ, నోటి దుర్వాసన కూడా ఉంటాయి. అందుకే ఉదయం వేళల్లో టీ, కాఫీలు తీసుకోవడం మానేయడం మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత ఒకసారి, సాయంత్రం వేళల్లో స్నాక్స్‌తో పాటు మరోసారి తీసుకుంటే చాలు. ఇలా ఓ క్రమబద్ధంగా టీ, కాఫీ అలవాటు చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ద్వారా కెఫీన్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ కణాలను ఉత్తేజపరుస్తుంది. ఇది తీవ్రమైన గుండెల్లో మంట మరియు యాసిడ్ రిఫ్లేక్స్ కు దారి తీస్తుంది.

Admin

Recent Posts