వినోదం

Chandra Mohan : ఆ ఒక్క కారణంగానే చంద్రమోహన్ ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉందా..?

Chandra Mohan : తెలుగు తెరపై సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ సినీ ప్రయాణం చాలా పెద్దది. ఎన్నో విలక్షణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు చంద్రమోహన్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన తన కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఆయనతో ఏ హీరోయిన్ నటించిన స్టార్ హీరోయిన్ అవుతారని సెంటిమెంట్ కూడా ఉండేది. ఈ సెంటిమెంట్ ఉండడంతో చంద్రమోహన్ తో స్టార్ హీరోయిన్లు ఆయనతో నటించడానికి క్యూ కట్టేవారు.

అప్పట్లో చంద్రమోహన్ కు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి పలుకుబడి ఉందేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చంద్రమోహన్ ఫ్యామిలీ నుండి ఒకరు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పారు. తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని ఇద్దరు బాగుంటారని.. చిన్నమ్మాయి చాలా బాగుంటుందన్నారు. వాళ్ళని చిన్నప్పుడు హీరోయిన్ భానుమతి చూసి పిల్లలు చాలా బాగున్నారు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేద్దామని అడిగినట్లు తెలిపారు.

this is the only reason why chandra mohan children not came into movies

కానీ తాను సున్నితంగా తిరస్కరించానని అన్నారు. నటుడుగా బిజీగా ఉండడంతో తనకు పిల్లలతో సమయం గడిపేందుకు వీలయ్యేది కాదన్నారు. వాళ్లు లేవకముందే షూటింగ్ కు వెళ్లిపోయేవాడినని చెప్పారు. భార్యా పిల్లలను ఎప్పుడైనా షూటింగ్ తీసుకువెళ్లినా వాళ్లు తనను గుర్తుపట్టే వాళ్ళు కాదని చెప్పారు. సినిమా ప్రభావం వాళ్ళపై పడకుండా ఇద్దరినీ పెంచాలని అనుకున్నట్టు తెలిపారు. అలాగే పెంచామని ప్రస్తుతం ఇద్దరు బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన అన్నారు. అందుక‌నే ఆయ‌న ఫ్యామిలీలో ఎవ‌రూ సినిమాల్లోకి రాలేదు.

Admin

Recent Posts