హెల్త్ టిప్స్

Tea : ప‌ళ్లు కూడా తోముకుండా ఉద‌యాన్నే టీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Tea : చాలా మంది ఉదయాన్నే టీ తీసుకుంటూ ఉంటారు. ఉదయాన్నే పళ్ళు కూడా తోముకోకుండా టీ తాగుతూ ఉంటారు. అయితే అలా పళ్ళు తోముకోకుండా టీ తాగడం వలన కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది బెడ్ టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఈ విషయం చాలామందికి తెలియదు.

ముఖ్యంగా స్ట్రాంగ్ గా టీ ని పెట్టుకుని తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలు కలుగుతాయి. ఖాళీ కడుపుతో ఇలా టీ ని తీసుకోవడం హానికరం. ఖాళీ కడుపుతో టీ ని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్ కి దారి తీస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో టీ ని తీసుకోవద్దు. ఒకవేళ కనుక తీసుకున్నట్లయితే జీవితాంతం షుగర్ సమస్యతో బాధపడాలి.

if you are drinking tea without brushing then know this

ఖాళీ కడుపుతో టీ తాగడం వలన నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్ర వేళలో ఎక్కువగా టీ ని తీసుకుంటే నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటివి కలుగుతాయి. వేసవిలో ఖాళీ కడుపుతో టీ ని తీసుకుంటే వికారం, వాంతులు, చికాకు వంటివి కలుగుతూ ఉంటాయి. ఖాళీ కడుపుతో టీ ని తీసుకుంటే ఇలా ఈ సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి వీలైనంత వరకు ఖాళీ కడుపుతో టీ ని తీసుకోవద్దు.

అలానే, ఖాళీ కడుపుతో టీ ని తీసుకుంటే ఆకలి కూడా ఉండదు. ఆకలి పోతుంది. పోషకాహార లోపంతో బాధపడడం, జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేయకుండా బలహీనంగా మారడం వంటివి కలుగుతాయి. ఉదయాన్నే, నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ తాగితే ఎసిడిటీ కూడా కలగొచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఖాళీ కడుపుతో టీ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి.

Admin

Recent Posts