హెల్త్ టిప్స్

Plastic Bottle Water : ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీటిని తాగుతున్నారా.. ఇన్ని వ్యాధులు వ‌స్తాయ‌ని తెలుసా..?

Plastic Bottle Water : ప్లాస్టిక్ ఆరోగ్యానికి హాని చేస్తుందని అందరికీ తెలుసు. అయినా కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ ని తాగుతూ ఉంటారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగితే పలు రకాల సమస్యలు వ‌స్తాయి. కాలేయ క్యాన్సర్ మొదలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని కనుక మీరు చూశారంటే ఇక మీదట ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు అస్సలు తాగరు.

ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఈ బాటిల్స్ ఎండ వలన టాక్సిన్స్ అలానే బీపీఏ ని నీటిలోకి విడుదల చేస్తాయి. బీపీఏ రక్తంలో ఎక్కువగా కలిస్తే అది హార్మోన్స్ పై ప్రభావం చూపుతుంది. గుండె సమస్యలు, విరేచనాలు, వాంతులు, అల్సర్ వంటి సమస్యలు కలగ‌వ‌చ్చు. 91వ‌ దశకంలో సాధారణంగా ఉండే వాటర్ బాటిల్ వ్యాపారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పెరిగిపోయింది.

if you are drinking water in plastic bottles then know this

చాలామంది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నింపిన నీళ్లను తాగుతూ ఉంటారు. ప్లాస్టిక్ బాటిల్స్ ను అనేక రసాయనాలతో తయారుచేస్తారు. వాటిలో కొన్ని.. హార్మోన్స్ పై ప్రభావితం చూపిస్తాయి. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ లో రసాయనాల‌ వలన నీళ్లు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. క్రమంగా వాటర్ బాటిల్ ఫ్లోరైడ్, అల్యూమినియం వంటి విష పదార్థాలను రిలీజ్ చేస్తుంది. ప్రతిరోజు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగడం వలన ఎన్నో సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగడం వలన రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లో రసాయనాలు నీళ్లల్లో కలిసినప్పుడు రోగనిరోధక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగడం వలన కెమికల్స్ కారణంగా కాలేయ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది. అలాగే పురుషుల స్పెర్మ్ నాణ్యత కూడా బాగా తగ్గుతుంది. క‌నుక ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్‌ను ఉప‌యోగించ‌కండి.

Admin

Recent Posts