వైద్య విజ్ఞానం

Over Sleep : అతిగా నిద్రపోవడం ఎంత ప్రమాదమో తెలుసా..? ఈ సమస్యలు వస్తాయి..!

Over Sleep : ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్రని పొందడం కూడా అవసరం. అయితే రోజూ ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అతిగా నిద్రపోవడం వలన మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఎక్కువగా నిద్ర పోవడం వలన ఈ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ ఎనిమిది గంటలకంటే ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవాళ్లు సరైన జీవనశైలి లేకపోవడం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. బాగా ఎక్కువ సేపు నిద్రపోతే గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అతిగా నిద్రపోవడం వలన చాలా రకాల సమస్యలు వస్తాయని స్టడీ చెప్తోంది. మెదడులోని ఒక భాగానికి రక్తప్రసరణ తగ్గినప్పుడు లేదంటే జరగనప్పుడు స్ట్రోక్ వస్తుంది. మెదడు ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుందో ఆ శరీర భాగంలో లోపాలు ఏర్పడతాయి.

over sleeping is very dangerous to health

అధ్యయనం ప్రకారం తేలిన విషయం ఏమిటంటే రాత్రి పూట ఎనిమిది గంటలకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వలన స్ట్రోక్ వచ్చే ప్రమాదం 23 శాతం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఉదయం పూట 90 నిమిషాలు నిద్రపోయే వాళ్లకి 30 నిమిషాల కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళతో పోల్చి చూసినట్లయితే పక్షవాతం వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంది. ఎక్కువసేపు నిద్రపోయే వాళ్ళల్లో స్ట్రోక్ వచ్చే ప్రమాదం 82 శాతం ఎక్కువగా ఉంది.

ఎక్కువసేపు నిద్రపోవడం వలన నిరాశ కలుగుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువసేపు నిద్రపోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. బరువు కూడా బాగా పెరిగిపోతారు. అలాగే స్ట్రోక్ ప్రమాదం కూడా ఇది పెంచుతుంది. ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సరైన జీవన శైలి పాటించాలి. సరిపడా నిద్ర, సరిపడా నీళ్లు, వ్యాయామం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Share
Admin

Recent Posts