Chapati : స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. మారిన జీవన ప్రమాణాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వలన పెరిగిన శారీరక బరువు పెద్ద సమస్యగా మారింది. దీంతో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే మొదటి పనుల్లో తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది వీటి వైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతీలను తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
చపాతీలని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచిది. పని ఒత్తిడిలో ఏ అర్దరాత్రో భోజనం చేసి వెంటనే కునుకు తీస్తుంటారు కానీ ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి హానికరం. భోజనం చేయడానికి, నిద్ర పోవడానికి మధ్య గ్యాప్ ఉంటే బాగుంటుంది. అలా చేయలేని వారికి చపాతీ తీసుకోవడం ఉత్తమం.
ప్లేట్ నిండుగా భోజనం చేసినా 2, 3 చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. ఏదైనా అతి అనర్దదాయకమే. కాబట్టి చపాతీలను మితంగానే తీసుకోవాలి. ప్లేట్ నిండా అన్నం తింటాం కదా అని ప్లేట్ నిండా చపాతిలు తింటే.. ఇంక ఏం ఉపయోగం ఉండదు. మనదేశంలో ఎక్కువ మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. చపాతీలను తినడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు.
గోదుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నిద్ర పోయేప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చవుతుంది. మనలోని క్యాలరీలు ఏమాత్రం తగ్గవు. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో కొవ్వుగా మిగిలి పోయి మనిషి లావుగా అయ్యే ప్రమాదం ఉంది. గోధుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. ఎక్కువగా విటమిన్ బి, ఇ, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. కనుక రాత్రి అన్నంకు బదులుగా రెండు చపాతీలను అది కూడా నూనె వేయకుండా కాల్చుకుని తింటే.. ఎంతో మేలు జరుగుతుంది.