Dum Ka Mutton : దసరా స్పెషల్‌.. దమ్‌ కా మటన్‌.. రోటీల్లోకి అద్భుతంగా ఉంటుంది..

Dum Ka Mutton : పండుగ వేళ సహజంగానే చాలా మంది మటన్‌ను తింటుంటారు. దసరా పండుగ అంటే.. నాన్‌వెజ్‌ ప్రియులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. చాలా మంది ఈ పండుగ రోజు నాన్‌వెజ్‌ వంటలను వండుకుని ఆరగిస్తుంటారు. అయితే మటన్‌ను ఎప్పుడూ చేసినట్లుగా కాకుండా కాస్త వెరైటీగా ఈ పండుగ రోజు చేసుకుని తినండి. దీంతో భిన్నమైన మటన్‌ రుచిని ఆస్వాదించవచ్చు. ఇక మటన్‌ వెరైటీ.. దమ్‌ కా మటన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దమ్‌ కా మటన్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

మటన్‌ – అర కిలో, వేయించిన ఉల్లిపాయలు – ఒక కప్పు, జీడిపప్పు – 50 గ్రాములు, బాదం పప్పు – 50 గ్రాములు, కొబ్బరిపొడి – మూడు టీస్పూన్లు, ధనియాల పొడి – రెండు టీస్పూన్లు, గరం మసాలా పొడి – ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్‌, పసుపు – పావు టీస్పూన్‌, కారం – రెండు టీస్పూన్లు, పెరుగు – ఒక కప్పు, కొత్తిమీర, పుదీనా – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – రెండు టీస్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – రెండు టీస్పూన్లు, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు.

cook Dum Ka Mutton for festival very tasty
Dum Ka Mutton

దమ్‌ కా మటన్‌ ను తయారు చేసే విధానం..

మటన్‌ను కడిగి నీళ్లు వడబోసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి, జీలకర్ర పొడులు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పెరుగు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు పోయరాదు. వీటిని గిన్నెలోకి తీసుకుని నెయ్యి, నూనె వేసి కలపాలి. దీన్ని మూత పెట్టి ఆరు గంటలు లేదా గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత మందపాటి గిన్నె లేదా పాన్‌లో ఈ మటన్‌ మిశ్రమం వేసి పైన అంచులకు తడిపిన గోధుమపిండి ముద్దను చుట్టలా చేసి అంటించి మూత పెట్టాలి. పైన బరువు పెట్టి పది నిమిషాలు మధ్యస్థంగా ఉండే మంట మీద, ఆ తరువాత 40 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికిస్తే కూర సిద్ధమైపోతుంది. ఇది అన్నం లేదా చపాతీల్లోకి బాగుంటుంది. నిదానంగా ఉడకడం వల్ల ముక్క చాలా రుచిగా ఉంటుంది.

Editor

Recent Posts