Chicken : చికెన్ ఇష్ట‌మ‌ని అధికంగా తింటున్నారా ? అయితే జ‌రిగే న‌ష్టాల‌ను తెలుసుకోండి..!

Chicken : ఆదివారం వ‌చ్చిందంటే చాలు మాంసాహార ప్రియులు ఎక్కువ‌గా చికెన్ ను తెచ్చుకుని వండుకుని తింటూ ఉంటారు. చికెన్ తో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. చికెన్ తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. చికెన్ లో అధికంగా ఉండే ప్రోటీన్లు మ‌న శ‌రీరంలో ఉండే కండరాల‌ను దృఢంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌రువు పెర‌గ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో కూడా చికెన్ దోహ‌ద‌ప‌డుతుంది.

if you are eating Chicken excessively then you should know these side effects
Chicken

చికెన్ తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తోపాటు విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ కూడా ల‌భిస్తాయి. అనేక ర‌కాల ఉప‌యోగాలు ఉన్న‌ప్ప‌టికీ దీనిని మితంగానే తీసుకోవాలి. చికెన్ ను త‌క్కువ‌గా తీసుకుంటేనే మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. చికెన్ ను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్యాల బారిన ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. రుచిగా ఉంది క‌దా దీనిని ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి న‌ష్టం వాటిల్లుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చికెన్ ను ఎప్పుడూ కూడా తాజాగా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వండుకుని తినాలి. ఎక్కువ కాలం ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని తిన‌కూడ‌దు. చికెన్ ను ఫ్రిజ్ లో నిల్వ చేయ‌డం వ‌ల్ల ఆ చికెన్ పై బాక్టీరియా ఎక్కువ‌గా చేరుతుంది. ఇలా బాక్టీరియా చేరిన చికెన్ ను తిన‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కోళ్ల ఫారాల‌లో పెంచే కోళ్ల‌కు మొక్క‌జొన్న గింజ‌ల‌ను ఆహారంగా వేస్తారు. వీటిని తిన‌డం వ‌ల్ల కోళ్లు ఎక్కువ‌గా కొవ్వు ప‌డ‌తాయి. ఈ కోళ్ల‌ను మ‌నం చికెన్ గా తిన‌డం వల్ల మ‌న శ‌రీరంలో కూడా కొవ్వు పెరిగే అవ‌కాశం ఉంటుంది. చికెన్ ను త‌క్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. కానీ చికెన్ ను ఎక్కువ‌గా తింటే మాత్రం మ‌నం బ‌రువు పెరుగుతాము.

చికెన్ తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. త‌ర‌చూ నూనెలో బాగా వేయించిన చికెన్ ను తిన‌డం వ‌ల్ల మ‌నకు క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కోడి పిల్ల‌లు త్వ‌ర‌గా పెర‌గ‌డానికి వాటికి మందుల‌ను సూది రూపంలో లేదా, ఆహారంలో క‌లిపి ఇస్తారు. ఇలాంటి కోళ్ల‌ను మ‌నం చికెన్ గా తిన‌డం వ‌ల్ల మ‌నకు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

అలాగే చికెన్ జీర్ణ‌మ‌వడానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక చికెన్ ను త‌క్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువ‌గా చికెన్ ను తిన‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య‌తోపాటు శ‌రీరంలో వేడి చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక చికెన్ ను ఎక్కువ మోతాదులో తీసుకోకూడ‌ద‌ని.. దానిని త‌క్కువ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం ఆరోగ్యక‌ర‌మైన‌ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts