హెల్త్ టిప్స్

రోజూ నోరు తెరిచి నిద్ర‌పోతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

చాలా మంది రాత్రి నిద్రపోయాక నోరు తెరుస్తారు. వాళ్లు నోరు తెరిచి నిద్రపోతారని వాళ్లకు కూడా తెలియదు. మరికొందరు గుర‌క పెడుతూ నిద్రపోతుంటారు.. ఇంకొందరు నోటితో గాలి పీల్చుతూ నిద్రపోతుంటారు. ఇలా చాలా రకాల అలవాట్లు ఉంటాయి ఒక్కొక్కరికి. అయితే.. నోరు తెరిచి నిద్రపోయే వారు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్టేనట. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం

నోరు తెరిచి నిద్రపోతున్నారంటే.. వాళ్లు నోటితోనే గాలి పీల్చుతారు. నోటితో గాలి పీల్చడం వల్ల నోట్లో లాలాజలం తగ్గిపోతుంది. ఎప్పుడైతే నోట్లో లాలాజలం తగ్గిపోతుందో.. అప్పుడు ప్రమాదకర బ్యాక్టీరియా నోటిలోకి చేరుతుంది. దీంతో నోరు దానంతట అదే శుభ్రం కాదు. అప్పుడు శ్వాస తీసుకొని వదిలే సమయంలో దుర్వాసన వస్తుంది. ఇంకా.. నోటితో గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సీజన్ సరఫరా తగ్గుతుంది. ఆక్సీజన్ సరఫరా తగ్గడం వల్ల రోజంతా అన్ ఈజీగా, అలసటగా ఉంటుంది. పెదాలు కూడా ఆరిపోయి చిట్లిపోయే ప్రమాదం ఉంది.

if you are sleeping with your mouth open then beware

పళ్లు కూడా ఒంకర టింకరగా మారే అవకాశం ఉంది. దీంతో నాలుక, పెదాలకు కూడా లేనిపోని సమస్యలు వస్తాయి. ఎక్కువ కాలం మీకు ఈ సమస్య ఉంటే.. లేట్ చేయకుండా డాక్టర్ ను సంప్రదించండి. ఆ అలవాటు మారడం కోసం డాక్టర్లు మీకు సరైన చికిత్స అందిస్తారు.

Admin

Recent Posts