రాత్రి పూట గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు ఒక్కోసారి మనకు ఎవరికైనా హఠాత్తుగా మెళకువ వస్తూ ఉంటుంది. అది సహజమే. పీడకల వస్తేనో… ఏదైనా శబ్దం విన్నట్టు అనిపిస్తేనో.. లేదా మరేదైనా ఇతర కారణాల వల్ల కూడా అలా నిద్రలో హఠాత్తుగా మెళకువ వస్తుంది. అయితే ఇది సహజమే అయినప్పటికీ కొందరికి మాత్రం రోజూ రాత్రి పూట ఒకే సమయానికి అలా హఠాత్తుగా మెళకువ వస్తుంది. మరి ఇందుకు కారణాలు ఏంటో తెలుసా..? రోజూ అలా రాత్రిపూట ఒకే సమయానికి నిద్ర నుంచి మెళకువ వస్తుంటే దాని అర్థం ఏమిటి..? ఏం చేస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు..? ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట 3 నుంచి 5 గంటల మధ్య మెళకువ వస్తే… అప్పుడు వారు జీవితంలో అన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే ఆ సమస్యలన్నింటినీ పోగొట్టుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. జీవితంలో ఏదైనా ఒక గోల్ పెట్టుకోవాలి. అప్పుడు ఆ సమస్యల నుంచి డైవర్ట్ అవుతారు. దీంతో రాత్రి పూట మెళకువ రాదు. అలాగే వీరు రోజూ మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను ప్రాక్టీస్ చేయాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
రాత్రి పూట 11 గంటలు దాటాక అర్థరాత్రి లోపు హఠాత్తుగా నిద్రలో మెళకువ వస్తే వారు నిత్యం ఒత్తిడి, ఆందోళనలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారని తెలుసుకోవాలి. వీరు తమకు ఉన్న సమస్యను ఇతరులతో చెప్పుకోవడం ద్వారా రిలీఫ్ పొందుతారు. అలాగే రోజూ మెడిటేషన్, యోగా చేయాలి. దీంతో మానసిక ప్రశాంతత కలిగి నిద్రలో మెళకువ రాకుండా ఉంటుంది. అర్థరాత్రి 12 నుంచి 2 గంటల మధ్య… నిద్రలో మెళకువ వస్తుంటే వీరు అభద్రతా భావంతో జీవిస్తున్నట్టు తెలుసుకోవాలి. జీవితంలో అన్నీ డిజప్పాయింట్‌మెంట్స్ ఉన్నా, ఎవరి చేతుల్లో అయినా మోసగింపబడ్డా ఇలా జరుగుతుంది. అయితే గతాన్ని మరిచిపోయి, నిత్యం హాయిగా జీవిస్తే ఇలా నిద్రలో మెళకువ రాకుండా ఉంటుంది.
రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య… ఎవరికైనా నిద్రలో మెళకువ వస్తుంటే వీరు లివర్ కు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుసుకోవాలి. ఆ భాగం పట్ల జాగ్రత్త వహించాలి. వీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటివి పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే బాగా ఆందోళన ఉన్నప్పుడు 5 నిమిషాల పాటు ప్రాణాయామం వంటివి చేస్తే ఫలితం ఉంటుంది. ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య… ఈ టైంలో సహజంగానే ఎవరైనా నిద్ర లేస్తారు. కనుక వారికి ఇప్పుడు చెప్పేది పనికిరాదు. నిద్ర లేవకుండా ఎప్పుడో 9, 10 గంటల వరకు పడుకుంటారు కదా, వారికి ఇది వర్తిస్తుంది. అలాంటి వారికి ఈ సమయంలో గనక రోజూ మెళకువ వస్తుంటే వారు సరైన నిద్ర అలవాట్లను పాటించడం లేదని తెలుసుకోవాలి. రాత్రి పూట త్వరగా నిద్రపోతే ఇలాంటి సమస్య ఉండదు. వీరు యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తే బెటర్.