హెల్త్ టిప్స్

Cold And Cough : దగ్గు, జలుబు ఉన్నాయా..? వీటిని పొరపాటున కూడా తినకండి.. అనేక సమస్యలు వస్తాయి..!

Cold And Cough : ఎక్కువగా చలికాలం, వానా కాలంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటి వాటితో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు సమస్య మొదలైందంటే అంత త్వరగా అవి తగ్గవు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన జలుబు, దగ్గు ఇంకా ఎక్కువవుతాయి. మరి ఎటువంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదనేది తెలుసుకుందాం. జలుబు, దగ్గు సమస్యతో బాధపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆహార పదార్థాలని తినకూడదు.

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ జలుబు, దగ్గు ఉన్నప్పుడు పాలను తీసుకోకూడదు. పాలు తాగితే ఛాతిలోని శ్లేష్మం పెరిగిపోతుంది, దగ్గు బాగా ఎక్కువవుతుంది. జలుబు, దగ్గు ఉన్నట్లయితే పాలని అసలు తీసుకోవద్దు. అన్నం తీసుకోకూడదు. అన్నం తీసుకోవడం వలన శ్లేష్మం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. జలుబుతో బాధపడే వాళ్ళు అన్నం తిన్నా కూడా సమస్య తీవ్రమ‌వుతుంది.

if you have cold then do not take these

దగ్గు, జలుబు ఉన్నట్లయితే షుగర్ ని తీసుకోవద్దు. చక్కెర వలన రోగనిరోధక శక్తి బలహీనమైపోతుంది. దగ్గు, తుమ్ములు ఎక్కువ అవుతాయి. జలుబు, దగ్గు ఉన్నట్లయితే కాఫీ కూడా తీసుకోవద్దు. కెఫిన్ ఇందులో ఎక్కువ ఉండడం వలన గొంతు కండరాలు పొడిబారి పోవడానికి దారితీస్తుంది. దగ్గు ఇంకాస్త ఎక్కువవుతుంది.

కాబట్టి ఇలా కూడా చేయకండి. దగ్గు, జలుబు ఉన్నట్లయితే మద్యం తీసుకోవద్దు. ఆల్కహాల్ ని జలుబు ఉన్నప్పుడు తీసుకోవడం వలన ఇబ్బంది పడాలి. గాయం మానడానికి కారణమయ్యే తెల్ల రక్త కణాలు కూడా దెబ్బతింటాయి. ఇలా అనేక సమస్యలు ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఎక్కువవుతాయి. కాబట్టి దగ్గు, జలుబు ఉన్నట్లయితే వీటికి దూరంగా ఉండండి. లేదంటే అనవసరంగా మీకే అనేక నష్టాలు కలుగుతాయి. ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Admin

Recent Posts