Onions : మనం రోజూ ఉల్లిపాయలను కూరల్లో వేస్తుంటాం. ఇవి లేకుండా ఏ కూర పూర్తి కాదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు. ఆయుర్వేద ప్రకారం ఇది వాస్తవమే. ఉల్లిపాయల వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లిపాయలను కొందరు పచ్చిగానే తింటుంటారు. అయితే పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఉల్లిపాయలను తినరాదు. మరి ఎవరెవరు ఉల్లిపాయలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఉల్లిపాయాల్లో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. అందువల్ల దీన్ని అధికంగా తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు తక్కువ మొత్తంలో ఉల్లిపాయలను తీసుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి.
2. ఉల్లిపాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని అధికంగా తీసుకుంటే హృదయ సంబంధ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు కూడా తక్కువ మొత్తంలో ఉల్లిపాయలను తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి.
3. గర్భిణీలు ఉల్లిపాయలను అస్సలు తినరాదు. తింటే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
4. ఉల్లిపాయల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. కనుక శరీరం లోపల రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు వీటిని తీసుకోరాదు. తింటే సమస్య ఇంకా ఎక్కువవుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.
5. షుగర్ లెవల్స్ తక్కువగా ఉండేవారి సమస్యను హైపో గ్లైసీమియా అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఉల్లిపాయలను తింటే షుగర్ లెవల్స్ ఇంకా పడిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక వీరు కూడా ఉల్లిపాయలను తినరాదు.