Bheemla Nayak : డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లోనూ.. భీమ్లా నాయ‌క్..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా ఈ మ‌ధ్యే ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్ని సెంట‌ర్ల‌లోనూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచలేదు.. అన్న విష‌య‌మే కానీ.. ఈ సినిమా ఎలాంటి ఢోకా లేకుండా విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది. అయితే ఈ సినిమాకు చెందిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ వ‌చ్చింది.

Bheemla Nayak may stream on disney plus hotstar too
Bheemla Nayak

భీమ్లా నాయ‌క్ చిత్ర డిజిట‌ల్ రైట్స్‌ను ఇప్ప‌టికే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా సొంతం చేసుకోగా.. ఈ మూవీ త్వ‌ర‌లో ఆ యాప్‌లో ప్ర‌సారం కానుంది. అయితే ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కూడా సొంతం చేసుకోబోతుంద‌ని తెలుస్తోంది. దీంతో ఆహాతోపాటు హాట్ స్టార్ యాప్‌లోనూ ఈ మూవీ స్ట్రీమ్ కానుంది తెలుస్తోంది. అదే జ‌రిగితే ఇండియాలోనే అతి పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన హాట్ స్టార్ కు అది అడ్వాంటేజ్ అవుతుంది. అత్య‌ధిక సంఖ్య‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లు హాట్ స్టార్ యాప్‌కు ఉన్నారు క‌నుక అందులో మూవీ స్ట్రీమ్ అయితే ఆ యాప్‌కు లాభం క‌లుగుతుంది. ఇంకా ఎక్కువ మంది చందాదారులు చేరే అవ‌కాశం ఉంటుంది. అందుక‌నే హాట్ స్టార్ ప్ర‌తినిధులు ఎలాగైనా ఈ మూవీని స్ట్రీమ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

ఇక భీమ్లా నాయ‌క్ సినిమా కేవ‌లం 4 వారాల్లోనే ఓటీటీల్లోకి రానుంద‌ని కూడా తెలుస్తోంది. సాధారణంగా అగ్ర హీరోల సినిమాలు ఓటీటీల్లో వ‌చ్చేందుకు క‌నీసం 2 నెల‌ల స‌మ‌యం అయినా ప‌డుతుంది. కానీ మ‌రో నాలుగు వారాల్లో.. అంటే మార్చి నెలాఖ‌రు వ‌రకు ఈ మూవీ ఓటీటీల్లోకి వ‌స్తుందని అంటున్నారు. ఇక డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సంస్థ ఇటీవ‌లే రామ్ నూత‌న చిత్రం వారియ‌ర్‌కు గాను ఓటీటీ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది.

Editor

Recent Posts