Alcohol : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని మనందరికి తెలుసు. మద్యం సేవించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ముఖ్యంగా కాలేయంపై ఇది తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తుంది. కానీ చాలా మందికి ఇది వ్యసనంగా మారిపోతుంది. మద్యం తాగనిదే వారు ఉండలేరు. కానీ కొన్ని రకాల లక్షణాలు మనలో కనబడితే మనం తప్పకుండా మద్యం సేవించడం మానేయాలి నిపుణులు చెబుతున్నారు. మరీ అవసరమైతే నిపుణుల సహాయాన్ని తీసుకుని మద్యపాన సేవనం మానేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం మానేయాలని సూచించే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అనుచిత సమయాల్లో మద్యం సేవించాలని అనిపించడం, ఆల్కహాల్ పట్ల బలమైన మరియు నిరంతరమైన కోరికలు కలగడం వంటి లక్షణాలు కనిపిస్తే మద్యపాన సేవనం వెంటనే మానేయాలి. అలాగే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి మద్యం తాగడాన్ని నియంత్రించలేకపోవడం కూడా ఒక సంకేతం.
అలాగే కాలేయ సమస్యలు, జీర్ణ సమస్యలు, హ్యాంగోవర్లు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే మద్యం తీసుకోవడం మానేయాలి. అదే విధంగా నిరంతరం పొత్తి కడుపులో నొప్పి, చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారిపోవడం వంటివి కాలేయ అనారోగ్యాన్ని సూచిస్తాయి. కనుక ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే మద్యం తీసుకోవడం మానేయాలి. అలాగే జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటివి నరాలకు సంబంధించిన సమస్యలను సూచిస్తాయి. కనుక ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మద్యం తీసుకోవడం మానేయాలి. అలాగే ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల మనలో సమతుల్యత లోపాలు ఏర్పడతాయి. ఇది ఒక ఆందోళనకరమైన సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. కనుక ఈ లక్షణం కనిపించిన వెంటనే మద్యం తీసుకోవడం మానేయాలి.
అలాగే అతిగా మద్యపాన సేవనం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మద్యపాన సేవనం మానేయాలి. అలాగే మద్యపాన సేవనం వల్ల తరచుగా మానసిక ఆందోళన, చిరాకు, నిరాశ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి మన శరీరం మద్యం తీసుకోవడం మానేయాలని హెచ్చరిస్తుందని అర్థం చేసుకోవాలి. అలాగే అతిగా మద్యం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి జీర్ణ సమస్యలు తలెత్తగానే మద్యం తీసుకోవడం మానేయాలి. ఈ విధంగా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మద్యం తీసుకోవడం పూర్తిగా మానేయాలని లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.