Exercise : ఈ లక్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు వ్యాయామం చేయాల‌ని అర్థం..!

Exercise : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ చాలా మంది వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు వాకింగ్ చేస్తే కొందరు రన్నింగ్, జాగింగ్ చేస్తారు. ఇంకొందరు సైకిల్ తొక్కుతారు. ఇంకా కొందరు జిమ్‌ల‌కు వెళ్లి ఎక్స‌ర్‌సైజులు గ‌ట్రా చేస్తుంటారు. అయితే పని ఒత్తిడి, ఆందోళన, బిజీ బిజీ జీవితం ఉన్న చాలా మంది నేటి త‌రుణంలో వ్యాయామం చేయడం లేదు. వ్యాయామం చేయకపోతే మన‌కు అనేక‌ అనారోగ్య సమస్యలు వస్తాయి.

వ్యాయామం చేయకపోతే మన శరీరం కొన్ని లక్షణాలను తెలియజేస్తుంది. ఈ లక్షణాలు గనుక మీలో ఉంటే మీరు వ్యాయామం చేయాలని అర్థం. వ్యాయామం చేయకపోతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ వ్యాయామం చేస్తుంటే శరీరంలో ఎలాంటి నొప్పులు ఉండవు. కానీ వ్యాయామం చేయకపోతే మీకు తరచుగా వెన్ను, నడుము, కాళ్ల‌లో నిరంతరం నొప్పిగా ఉంటుంది. చేతులు, భుజాలు, మెడ తదితర భాగాల్లోనూ ఎప్పుడూ నొప్పి వస్తుంది. ఈ లక్షణాలు కనుక మీలో కనిపిస్తుంటే మీరు వ్యాయామం చేయాలని అర్థం చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేస్తే ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయి.

if you have these symptoms then you need to do Exercise
Exercise

మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయంటే మీరు వ్యాయామం చేయాలని అర్థం. రోజూ వ్యాయామం చేయడం ద్వారా కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు ఉన్నాయంటే మీరు రోజూ వ్యాయామం చేయాలని అర్థం. వ్యాయామం చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయటపడతారు. రాత్రిపూట చక్కగా నిద్ర పడుతుంది.

చాలామంది జంక్ ఫుడ్ కు అలవాటు పడుతుంటారు. దీని వల్ల కూడా వ్యాయామం చేయలేక పోతారు. మీరు గనక జంక్ ఫుడ్ ని ఎక్కువ తీసుకుంటున్నట్టయితే మీరు వ్యాయామం చేయలేరు. కనుక జంక్ ఫుడ్ ను మానేయాల్సి ఉంటుంది. అప్పుడు వ్యాయామంపై దృష్టి పెడతారు. ఇలా కొన్ని లక్షణాలను బట్టి మీకు వ్యాయామం అవసరం అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts