హెల్త్ టిప్స్

100 ఏళ్ల వ‌ర‌కు జీవించాల‌ని, ఆయుష్షును పెంచుకోవాల‌ని చూస్తున్నారా..? అయితే ఇవి తినండి..!

పూర్వం మ‌న పెద్ద‌లు 100 ఏళ్ల‌కు పైగా బ‌తికేవారు. కానీ ఇప్పుడు స‌గ‌టు మ‌నిషి ఆయుష్షు అనేది 60 ఏళ్ల‌కు ప‌డిపోయింది. 60 ఏళ్ల వ‌ర‌కు ఇప్పుడు బ‌తికితే గొప్ప అంటున్నారు. చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటుతో మ‌ర‌ణిస్తున్నారు. లేదా చాలా మంది క్యాన్స‌ర్‌, కిడ్నీ వ్యాధులు వంటి వ్యాధుల‌తో మ‌ర‌ణిస్తున్నారు. ఇక ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించే వారి సంఖ్య స‌రేస‌రి. అయితే మ‌నిషి ఆయుర్దాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాల‌ని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకు గాను బ‌రువు త‌గ్గాల్సి ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. నేచ‌ర్ కమ్యూనికేష‌న్స్ అనే ఓ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం ప్ర‌కారం అధిక బ‌రువును త‌గ్గించుకుని, బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకుంటే ఆయుర్దాయం 2 నెల‌ల వ‌ర‌కు పెరుగుతుంద‌ని తేల్చారు. అధిక బ‌రువు ఉండ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వారు అంటున్నారు.

ఇక మ‌నిషి ఆయుర్దాయాన్ని త‌గ్గించే అంశాల్లో పొగ తాగ‌డం కూడా ఒక‌టి. పొగ తాగ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం పెరుగుతుంది. దీంతో ఆయుర్దాయం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని అంటున్నారు. అలాగే డ‌యాబెటిస్ ఉండ‌డం, అనారోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అల‌వాట్లు, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల కూడా ఆయుర్దాయం 7 ఏళ్ల వ‌ర‌కు త‌గ్గిపోతుంద‌ని అంటున్నారు. ఈ మేర‌కు స్కాట్లండ్‌లోని యూనివ‌ర్సిటీ ఆప్ ఎడిన్‌బ‌ర్గ్ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇందుకు గాను వారు 6 ల‌క్ష‌ల మందిపై చేసిన అధ్య‌య‌నాల‌ను విశ్లేషించారు. చివ‌ర‌కు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఇక మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల కూడా ఆయుర్దాయం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని వారు అంటున్నారు.

if you want to increase your life span then take these foods

అయితే ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆయుర్దాయం గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిల్లో అల్లం చాలా ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి ఆయుర్దాయాన్ని గ‌ణ‌నీయంగా పెంచుతాయి. అల్లంలో సుమారుగా 25 ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క‌ణాలు డ్యామేజ్ అవ‌కుండా, క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే ఆర్థ‌రైటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. క‌నుక రోజూ అల్లం ర‌సాన్ని సేవిస్తుంటే ఆయుర్దాయాన్ని గ‌ణ‌నీయంగా పెంచుకోవ‌చ్చు. దీంతోపాటు యాల‌కులు కూడా ఆయుర్దాయాన్ని పెంచేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

యాల‌కుల‌తో టీ చేసి రోజూ తాగ‌డం వ‌ల్ల ఎంత‌గానో ఉప‌యోగం ఉంటుంది. యాల‌కుల టీ తాగితే శ‌రీరంలోని టాక్సిన్లు బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరం అంత‌ర్గతంగా క్లీన్ అవుతుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఆయుష్షు పెరుగుతుంది. వాము గింజ‌ల‌ను కూడా రోజూ తిన‌వ‌చ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. వాములో నియాసిన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వాము స‌హజ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేయ‌డంతోపాటు ఆయుష్షును పెంచేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. తేనెను ఆయుర్వేద ప‌రంగా సూప‌ర్‌ఫుడ్‌గా చెబుతారు. క‌నుక తేనెను తీసుకుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఇది వ‌య‌స్సు మీద ప‌డకుండా చేస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను త‌గ్గిస్తుంది. తేనెలో స‌హ‌జ‌సిద్ధంగా మిన‌ర‌ల్స్ ల‌భిస్తాయి. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తేనెను రోజూ తింటే ఆయుష్షు సైతం పెరుగుతుంది.

Share
Admin

Recent Posts