Lemon Juice : ప్రస్తుతం చాలా మందిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. దీంతో చాలా మంది అనేక జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక ఆరోగ్యకరమైన పానీయాలను తాగుతున్నారు. వాటిల్లో నిమ్మరసం కూడా ఒకటి. కొందరు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతున్నారు. ఇందులో కొంతమంది తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుందని భావిస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంది కొన్ని తప్పులు చేస్తున్నారు. వాటిని సరిదిద్దుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ నేపథ్యంలో శరీరాన్ని సరైన ఆకృతిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటివారు ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగుతున్నారు. అయితే ఇది మంచి అలవాటే కానీ నిమ్మరసాన్ని ఉదయాన్నే ఎక్కువగా తీసుకోవద్దు అని చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల పులుపు శాతం దంతాలపై ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు. ఇది ఎక్కువైతే అది దంతాల నుంచి చిగుళ్లపై పడుతుందని చెబుతున్నారు. అందుకే నిమ్మరసం శాతాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. బ్రష్ అనంతరం దాన్ని డైరెక్ట్ గా తీసుకుంటారు. కానీ ఇలా చేయకూడదు.
నిమ్మరసం తీసుకునే ముందు కచ్చితంగా నోటిని శుభ్రం చేసుకోవాలి. రెండు మూడు సార్లు నోటిని నీటితో పుక్కిలించాలి. ఆ తర్వాత నీటిని తాగాలి. లేకపోతే నోటిలోని బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సగం నిమ్మపండు కంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మరసాన్ని ఎక్కువ వాడితే అసిడిటీ వస్తుంది. అది మనకు ఆటంకాలను కలిగిస్తుంది. కనుక మోతాదుకు మించి అస్సలు వాడొద్దు. చాలామంది చేసే మరో తప్పు ఏమిటంటే జిమ్ జాగింగ్ కి వెళ్ళినప్పుడు దుకాణాల్లో వాటిలో విక్రయించే నిమ్మరసం తాగుతుంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. ఇందులో ఎక్కువగా ప్రిజర్వేటివ్ లు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతమాత్రం మంచిది కాదు. అందుకే ఇంట్లో సహజ సిద్ధంగా తీసిన రసాన్ని మాత్రమే తీసుకోవడం చాలా మంచిది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తేనే నిమ్మరసాన్ని తీసుకున్న ప్రయోజనం కలుగుతుంది. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు.