Milk Boil : పాలు పొంగు పోకుండా ఉండాలంటే.. ఉప‌యోగ‌ప‌డే సుల‌భ‌మైన ట్రిక్‌.. ఏం చేయాలంటే..?

Milk Boil : పాలను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్రయోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. పాల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. అందుక‌నే వాటిని సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబ‌ట్టే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ రోజుకు క‌నీసం ఒక్క గ్లాస్ పాల‌ను అయినా తాగాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు.

అయితే పాల‌ను మ‌నం మ‌ర‌గ‌బెట్టి తాగుతుంటాం. కానీ చాలా మంది పాల‌ను మ‌రిగించేప్పుడు అవి పొంగి పోతుంటాయి. వాటిని స్ట‌వ్ మీద పెట్టి వేరే ఆలోచ‌న‌లోనో ప‌నిలోనో ప‌డిపోతారు. దీంతో పాలు పొంగి పోతాయి. నూటికి 90 శాతం మంది ఇలాగే చేస్తారు. అయితే పాలు పొంగి పోకుండా ఉండాలంటే.. అందుకు ఒక చిన్న ట్రిక్ ఉంది. దాన్ని పాటిస్తే చాలు.. ఇక‌పై ఎప్పుడు పాల‌ను మ‌రిగించినా అవి పొంగి పోవు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.

Milk Boil how to stop them overflow
Milk Boil

పాల‌ను స్ట‌వ్ మీద పెట్టిన‌ప్పుడు గిన్నె మీద అడ్డంగా ఒక చెక్క గంటెను ఉంచాలి. అంతే.. పాలు పొంగు దాకా వ‌చ్చినా పొంగి పోవు. పైనే ఆగి ఉంటాయి. అందువ‌ల్ల మ‌నం కావ‌ల్సిన‌ప్పుడు స్ట‌వ్‌ను ఆఫ్ చేయ‌వ‌చ్చు. దీంతో పాలు పొంగి పోకుండా ఉంటాయి. ఇది చాలా సుల‌భంగా ప‌నిచేసే ట్రిక్‌. ఇంత‌కీ అస‌లు ఇది ఎలా పనిచేస్తుందంటే..

కింద మంట పెట్టిన‌ప్పుడు పాల‌పై ఒక పొర‌గా పైకి వ‌స్తుంది. అలా వ‌చ్చిన పొర గరిటెను తాక‌గానే ఆవిరితో కూడిన ఆ పొర ప‌గిలిపోతుంది. చెక్క త్వ‌ర‌గా ఉష్ణాన్ని గ్ర‌హించ‌దు కాబ‌ట్టి అది త్వ‌ర‌గా వేడెక్క‌దు. అందుకే పాలు అక్క‌డి వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోతాయి. అంతే.. అందువ‌ల్ల పాలు అనేవి పొంగు రావు. కాబ‌ట్టి ఇక‌పై పాల‌ను మ‌రిగిస్తే.. గిన్నెపై ఒక చెక్క గంటెను ఉంచ‌డం మ‌రిచిపోకండి. చాలా సుల‌భంగా వ‌ర్క‌వుట్ అయ్యే ట్రిక్ ఇది. అంద‌రికీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Editor

Recent Posts