హెల్త్ టిప్స్

ఉడకబెట్టిన గుడ్డును ఎంత సమయంలోగా తినాలో తెలుసా ?

ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు.ముఖ్యంగా మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉంటే కరోనా మహమ్మారి బారిన పడిన కూడా మనకి ఎలాంటి ప్రమాదం ఉండదని భావించడంతో ప్రతి ఒక్కరు వారి రోజువారి ఆహారంలో భాగంగా గుడ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను వివిధ రకాలుగా తయారు చేసుకొని తింటుంటారు.

గుడ్డులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందాలంటే తప్పనిసరిగా గుడ్లను ఉడికించి తిన్నప్పుడే అందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. అయితే ఒకసారి ఉడికించిన గుడ్డును ఎంత సమయంలోగా తినాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

in how much time we have to eat boiled egg in how much time we have to eat boiled egg

సాధారణంగా ఒక సారి ఉడికించిన కోడిగుడ్డును ఫ్రిజ్ లో పెట్టకుండా కేవలం రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోగా తినేయాలి. లేదంటే ఆ గుడ్డు పై ఇతర బ్యాక్టీరియాలు చేరి అది ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ ఉడికించిన గుడ్లను రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలనే వారు రెండు నుంచి ఐదు రోజుల వ్యవధిలోగా తినాలి.అయితే ఉడికించిన కోడిగుడ్లను బయట బాగా చల్లార్చి వాటిపై భాగంలో ఎలాంటి తేమ లేకుండా గుడ్లను ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవాలి. కోడిగుడ్డు పైభాగం పగిలిన వాటిని ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదు.ఒకవేళ ఉడికించిన కోడిగుడ్లు ఫ్రిజ్లో పెట్టి మరి వాటిని తినాలని భావించినప్పుడు తినడానికి ఒక పది నిమిషాలు ముందుగా బయటకు తీసే పెట్టాలి.ఉడికించిన కోడిగుడ్లను ఫ్రిజ్లో నిల్వ చేసేటప్పుడు పొరపాటున కూడా గుడ్డు పెంకును తొలగించకూడదు.

Admin

Recent Posts