Jaggery Chickpeas : బెల్లం, శనగల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఈ రెండింటి ద్వారా మనకు లభిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. గుప్పెడు శనగలను తీసుకుని పెనంపై వేయించి వాటిని చిన్న బెల్లం ముక్కతో తినాలి. ఇలా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయంలో తినాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగలను బెల్లంతో కలిపి తినడం వల్ల శక్తి బాగా లభిస్తుంది. రోజంతా శారీరక శ్రమ చేసేవారితోపాటు వ్యాయామం అధికంగా చేసేవారు ఈ రెండింటినీ కలిపి తింటే శక్తి బాగా అందుతుంది. దీంతో అలసట లేకుండా ఎంత సేపైనా పనిచేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. అలాగే నీరసం, నిస్సత్తువ ఉన్నవారు ఈ రెండింటినీ కలిపి తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. శనగలు, బెల్లం రెండింటిలోనూ మనకు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
3. శనగలు, బెల్లం రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ, లివర్ శుభ్రంగా మారుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం ఉండదు. గ్యాస్ సమస్య తగ్గుతుంది. అజీర్ణం నుంచి బయట పడవచ్చు. అలాగే లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గుతారు.
4. ఉదయం ఈ రెండింటినీ కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చిన్నారులకు వీటిని ఇస్తే వారు యాక్టివ్‌గా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. నేర్చుకున్న పాఠ్యాంశాలు సరిగ్గా గుర్తుకు వస్తాయి. పరీక్షల్లో విజయం సాధిస్తారు.
5. శనగలను పొట్టుతో సహా అలాగే బెల్లంతో కలిపి తింటే ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది బరువు తగ్గించేందుకు సహాయ పడుతుంది. ఇలా ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలను పొందవచ్చు.