Jeelakarra Kashayam : జీల‌క‌ర్ర‌తో క‌షాయం త‌యారీ ఇలా.. దీన్ని రోజూ ఇలా తీసుకుంటే ఏ రోగాలు ఉండ‌వు..

Jeelakarra Kashayam : జీల‌క‌ర్ర‌… ఇది ఉండ‌ని వంట‌గ‌ది ఉండ‌నే ఉండ‌దు అని చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా మ‌నం జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నాం. జీల‌క‌ర్ర‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. రుచిని పెంచ‌డంతో పాటు జీల‌క‌ర్ర చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. జీల‌క‌ర్ర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించి మ‌న అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అయితే ఈ జీల‌క‌ర్ర‌ను ఎలా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.. జీల‌క‌ర్ర వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డానికి బ‌దులుగా దీనితో క‌షాయాన్ని చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జీల‌క‌ర్ర‌తో క‌షాయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. త‌రువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజూ ఈ జీల‌క‌ర్ర‌ను నీటితో స‌హా స్ట‌వ్ మీద ఉంచి మ‌రిగించాలి. జీల‌క‌ర్ర మెత్త‌గా అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ క‌షాయం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత నీటిని తాగుతూ జీల‌క‌ర్ర‌ను తినాలి. ఈ విధంగా జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా జీల‌క‌ర్ర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Jeelakarra Kashayam prepare in this way take in this time
Jeelakarra Kashayam

అలాగే ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న స‌మ‌స్యల్లో అధిక బ‌రువు స‌మ‌స్య ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు, శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిప‌డుతున్న వారు జీల‌క‌ర్ర‌తో ఈ విధంగా క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా, చాలా త్వర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. శ‌రీరంలో మెట‌బాలిజాన్ని పెంచి బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో ఇది మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. జీల‌కర్ర‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తిని పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

జీల‌క‌ర్ర క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు జీల‌క‌ర్ర క‌షాయాన్ని తీసుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అలాగే శ‌రీరంలో నొప్పులు, వాపుల‌తో బాధ‌ప‌డే వారు ఈ జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. జీల‌క‌ర్ర క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

D

Recent Posts